బిగ్ అలెర్ట్: ప్రమాదంగా మారిన వ్యాయాయం, రన్నింగ్.. ఆశ్చర్యపోయే నిజాలు బయటకి!
అందులో భాగంగానే వారానికి 30 నుండి 50 కిలోమీటర్ల రన్నింగ్ చేయవచ్చట. రోజుకి 7,000 నుండి 10,000 అడుగుల నడక చాలా ఉత్తమమని చెబుతున్నారు.
By: Madhu Reddy | 16 Sept 2025 12:00 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా.. మనం కూడా వేగంగా పరిగెత్తాలి అని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పని పైన శ్రద్ధ పెడుతున్నారు. కానీ ఆరోగ్యం పైన పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి కరోనా ముందు వరకు కూడా చాలామంది ఆరోగ్యంపై పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు.. ఎప్పుడైతే కరోనా వచ్చి చాలామంది పిట్టల్లా రాలిపోయారో.. అప్పటినుంచి ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరిగింది. అందుకే ఈ ఉరుకుల పరుగుల గజిబిజి లైఫ్ స్టైల్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా సరే తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు.
అందులో భాగంగానే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ.. రన్నింగ్ చేస్తూ.. కాస్త రిలాక్సేషన్ పొందుతున్నారు. అయితే ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిదే.. రన్నింగ్ కూడా శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది. కానీ ఏదైనా సరే మితిమీరనంత వరకు మాత్రమే అని గ్రహించాలి. ఏదైనా సరే పరిమితిని మించి చేస్తే ప్రమాదం తప్పదు.. ఎప్పుడైతే అతిగా వ్యాయామం చేస్తామో.. లేదా అతిగా రన్నింగ్ చేయడం లాంటివి చేస్తామో.. అప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు అని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు మితిమీరిన పనులు ప్రమాదాలను తెచ్చిపెడతాయని కూడా ఇప్పటికే ఎంతమంది సెలబ్రిటీలు నిరూపించారు కూడా.. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదలుకొని చాలామంది సెలబ్రిటీలు ఇలా అతిగా వ్యాయామాలు చేసి గుండెపోటుతో ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే ఇదొక హెచ్చరిక లాగా ఇప్పుడు కొంతమంది నిపుణులు కూడా రోజు ఎంతవరకు రన్నింగ్ చేయాలి అనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.
అందులో భాగంగానే వారానికి 30 నుండి 50 కిలోమీటర్ల రన్నింగ్ చేయవచ్చట. రోజుకి 7,000 నుండి 10,000 అడుగుల నడక చాలా ఉత్తమమని చెబుతున్నారు. ఇంతకు మించి ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఉందని.. వారానికి రెండు నుండి మూడుసార్లు స్ట్రెంత్ ట్రైనింగు సరిపోతుందని..మితమైన వ్యాయామం.. సరైన విశ్రాంతి శరీరానికి అవసరమని అంతకుమించి చేసామో అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయని కూడా హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో చాలామంది అటూ పని ఒత్తిడి ఎంతైతే అనుభవిస్తున్నారో.. ఇటు ఆరోగ్యం కోసం వ్యాయామం, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తున్నారు. కానీ మితిమీరి చేయడం వల్ల అనారోగ్యానికి కూడా మనం ఆస్కారం కల్పిస్తున్నాం అనే విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఇక మనిషి తన జీవన మనుగడలకు ముందుకు సాగించాలి అంటే.. ప్రస్తుత కాలాన్ని బ్యాలెన్స్ చేస్తేనే అటు ఆరోగ్యంతో పాటు ఇటు ప్రశాంతత..ఆర్థిక సమస్యలు కూడా లేకుండా జీవనాన్ని సాగించవచ్చు అని తెలుసుకోవాలి అంటూ అనుభవజ్ఞులైన నిపుణులు కూడా చెబుతున్నారు.
