జ్ఞానేశ్ హయాంలోనే 20 అసెంబ్లీ ఎన్నికలు...2029 లోక్ సభ సన్నాహాలు !
ఇప్పుడు దేశంలోని విపక్షాలు అన్నీ కూడా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.
By: Satya P | 11 Oct 2026 8:53 PM ISTఇప్పుడు దేశంలోని విపక్షాలు అన్నీ కూడా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. అన్నింటికీ మించి జ్ఞానేశ్ కుమార్ మరో రెండేళ్లకు పైగా సీఈసీగా ఉంటారు. ఆయన పదవీ కాలం ముగిసేలోగా దేశంలో మెజారిటీ అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించాల్సి ఉంది. దాంతో ఆయన వద్దే వద్దు రాజీనామా చేయాల్సిందే అని విపక్షాలు అన్నీ ఒక్క లెక్కన ఆందోళనలు చేస్తున్నాయిఉ.
కీలక రాష్ట్రాలన్నీ :
ఇక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవీ కాలం చూస్తే ఆయన 2025 ఫిబ్రవరి 19న దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆయన 2029 జనవరి 26న పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటి నుంచి తన పదవీ కాలం ముగిసేలోగా ఆయన దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2027లో జరిగే రాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. పర్యవేక్షించనున్నారు. అంతే కాదు 2029 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలు కూడా ఈయన నేతృత్వంలోనే జరగనున్నాయి. ఇక ఆయన పదవికి చట్టపరమైన ప్రాధాన్యత ఉండడం మరో విశేష. 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ప్రకారం నియమితులైన మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈయనే కావడం విశేషం. దాంతో ఆయనను పదవి నుంచి తొలగించడం అసాధ్యం అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
అందుకే కలవరం :
ఇక 2027 మొదటి నుంచి అనేక అసెంబ్లీ ఎన్నికలు దేశంలో మొదలు కాబోతున్నాయి. వాటిలో దేశానికి గుండె కాయ లాంటి యూపీ కూడా ఉంది. అలాగే గుజరాత్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా అనేక కీలక రాష్ట్రాలు ఉన్నాయి. 2029 మే లో జరిగే లోక్ సభ ఎన్నికల సన్నాహాలను కూడా జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షిస్తారు అని అంటున్నారు. దాంతో ఆయన రాజీనామా చేయాల్సిందే అని విపక్షం అంతా ఒక్క లెక్కన డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇష్యూ ఇప్పట్లో తెమిలేదు కాదు అని అంటున్నారు.
అప్పటిదాకా కంటిన్యూ :
సీఈసీ రాజీనామా చేయాలన్న ఇష్యూ అయితే దేశంలో ఇది సుదీర్ఘ కాలం సాగనుంది. ఇది మాత్రం కన్ ఫర్మ్. ఎందుకు అంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అన్నది జరగని విషయం. ఇది రాజకీయ ప్రతిష్ట కాదు, రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఇక చూస్తే ఈ విషయంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పెద్దలు కూడా ఎక్కడా తగ్గకుండా ఉండాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో జరిగిన వ్యూహాత్మకమైన తప్పిదాన్ని ఈసారి చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు అని కూడా అంటున్నారు.
విపక్షాలకు ఆయుధం :
అయితే మిగిలిన అన్ని అంశాల కంటే కూడా ఇది విపక్షాలకు ఇపుడు అత్యంత ప్రధానమైన అంశంగా ఉంది. ఓటు చోరీ అని బీహార్ ఎన్నికల నుంచే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నా ఒక జాతీయ పత్రిక కధనంలో వచ్చిన వార్తలతో ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యమం కాంగ్రెస్ కి కూడా బూస్ట్ ఇచ్చింది అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని వదిలే సమస్య లేదని చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ రాజీ లేని మూడు డిమాండ్లు అని తీర్మానించి మరీ రంగంలోకి దిగింది. అందులో తొలి డిమాండ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా అయితే రెండవది సర్ మొత్తం ప్రక్రియను రద్దు చేయడం, మూడవది బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరపడం. దాంతో కాంగ్రెస్ సైతం సుదీర్ఘమైన పోరాటానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
సీజేపీ సైతం :
మరో వైపు చూస్తే సీజేపీ నేతలు అరెస్ట్ అయి బయటకు వచ్చాక మీడియా మీట్ పెట్టి చెప్పింది ఒక్కటే. తాము ఈ ఇష్యూలో తగ్గేది లేదని, తాము జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకూ ఉద్యమిస్తామని కూడా స్ఫష్టత ఇచ్చారు. దాంతో ఈ అంశం అయితే విపక్షాలతో పాటు సీజెపీ లాంటి జెన్ జీ తరానికి పౌర సంఘాలకు మేధావులకు ఒక బిగ్ ఇష్యూగా మారిపోతోంది. దీనిని ఎంత దాకా వీలైతే అంత దాకా క్షేత్ర స్థాయిలోకి తీసుకుని పోవాలనే అంతా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో దేశమంతా రానున్న రెండున్నరేళ్ళ కాలం ఇదే అంశం మీద భారీ ఉద్యమాలే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
