దట్ ఈజ్ ఇండియా... ఆపరేషన్ సిందూర్ లో గాయపడిన 'గౌరీ'కి కొత్త జీవితం!
ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ లో గాయపడిన ఆవు "గౌరీ"కి పశువైద్యులు కొత్త జీవితం అందించారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
By: Raja Ch | 17 Nov 2025 12:00 PM ISTపాడిపశువులను, జంతువులను, పక్షులను.. కుటుంబ సభ్యులుగా చూస్తూ, దేవతలుగా కొలిచే భారతదేశం గొప్పతనం పాకిస్థాన్ కు ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎలా చెప్పినా అర్ధం కాదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గర్వపడే ఓ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ లో గాయపడిన ఆవు "గౌరీ"కి పశువైద్యులు కొత్త జీవితం అందించారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... పాక్ ఉగ్రమూకలు చేపట్టిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతి స్వల్ప వ్యవధిలో అటు పాక్ లోని ఉగ్రవాదులను, ఆ దేశ సైన్యాని వణికించేసింది. అయితే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్ లో "గౌరీ" అనే ఆవు కాలు కోల్పోయింది. ఇది ఎంతో విషాదకర విషయంగా నిలిచింది.
వివరాళ్లోకి వెళ్తే... ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ సైన్యం జరిపిన భారీ సరిహద్దు కాల్పుల్లో ఒకటిన్నర సంవత్సరాల గౌరీ అనే ఆడ ఆవు కాలు కోల్పోయింది. ఈ సమయంలో దానికి చికిత్స చేసిన పశువైధ్యులు... "కృష్ణ లింబ్" అనే కొత్త కృత్రిమ అవయువాని అమర్చారు. దీనితో ఆమెకు కొత్త జీవితం లభించింది.
ఆరెస్ పురాలోని ఫతేపూర్ సమారియా పోస్టుకు చెందిన టీ అమ్మకందారుడు రాజేష్ ఇంటిని మే 20న పాక్ షెల్లింగ్ ధ్వంసం చేసింది. ఈ ఘటనలోనే ఆ దూడ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక పశువైద్యులు ఆమెకు చికిత్స చేయడానికి వెనుకాడటంతో పాటు.. భారీ వర్షాలు ఆమె కోలుకోవడాన్ని మరింత అలస్యం చేశాయి.
ఈ సమయంలో దేశం అంతటా వికలాంగ జంతువులకు సపోర్ట్ ఇచ్చే రాజస్థాన్ కు చెందిన ప్రముఖ పశువైద్యుడు డాక్టర్ తపేష్ మాథూర్ ను సంప్రదించాడు. ఈ సమయంలో రంగంలోకి దిగిన డాక్టర్ మాథుర్.. గౌరీ చికిత్సను చేపట్టి సక్సెస్ ఫుల్ గా ఆమెకు కృష్ణ లింబ్ ను అమర్చారు. దీంతో గౌరి మునిపటిలా నడుస్తోంది.
నివేదికల ప్రకారం... డాక్టర్ మాథుర్ 22 రాష్ట్రాల్లో వేలాది వికలాంగ జంతువులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ముఖ్యంగా.. అవసరమైన జంతువులకు ఆయన కృత్రిమ అవయువాలను ఉచితంగా అందిస్తారు. ఈ నేపథ్యంలో అతని సర్వీ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో గుర్తించబడింది.
