క్రేన్ కి వేలాడిన పింక్ కలర్ ‘కారు’... వీడియో, కామెంట్లు వైరల్!
మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే... బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By: Raja Ch | 15 Nov 2025 11:55 AM ISTజూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... బల్దియా ఎన్నికలకు ముందు అధికార పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదంతా రౌడీయిజంతో వచ్చిన గెలుపని, నైతికంగా విజయం తనదే అని బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు.
మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూస్తే... బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని.. "ఆర్.ఎస్. బ్రదర్స్" సమీకరణం బాగానే పని చేసిందని చెప్పారు. ఆ సంగతి అలా ఉంటే... బీఆరెస్స్ కారును ఊరేగిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేసిన సంబరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు భాగ్యనగరంలో హల్ చల్ చేశారు. ఇందులో భాగంగా... బీఆరెస్స్ ఎన్నికల గుర్తు కారును క్రేనుకు తగిలించి ఊరేగించారు. పింక్ రంగులో ఉన్న ఆ కారుకు కాంగ్రెస్ జెండాలు తగిలించారు! దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఓ నెటిజన్... "గెలుపు ఓటములు సహజం కానీ.. బీఆరెస్స్ అధికారంలో ఎన్నో ఎన్నికలు గెలిచింది, ఎప్పుడైనా ఇలా చేసిందా! అహంకారం అని పక్కనోడిని అనడం కాకపోతే ఇంత బలుపు ఎందుకు! డిపాజిట్ రాకుండా పోయిన బీజేపీని ఒక్క మాట అనకుండా అందరి టార్గెట్ బీఆరెస్స్" అని రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ కు బీఆరెస్స్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా... "దీన్నే రౌడీ రాజకీయం అంటారు! రేపు మీరు కూడా ఓడిపోతారు. కానీ మేము ఇట్లా ఓవర్ చేయం" అని రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కామెంట్ సెక్షన్ లో చిన్న సైజ్ వార్ మొదలైంది!
