'ఆ' సినిమాలు చూస్తే జైలు పాలే.. జాగ్రత్త!
ఐటీ చట్టంలోని 67 బీ సెక్షన్ ప్రకారం చిన్నారులకు సంబంధించి దుస్తులు లేకుండా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం నేరం.
By: Raja Ch | 7 Feb 2026 7:00 PM ISTఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని ఘటనలు తెరపైకి వచ్చినా.. "ఆ" సినిమాలు చూసే బ్యాచ్ మాత్రం తగ్గడం లేదు! సరికదా.. ఆ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెరపైకి వచ్చిన ఘణాంకాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా 16 ఏళ్ల లోపు వారు చైల్డ్ పొ*ర్న్ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయోజకులు కావాల్సిన వయసులో చట్టం ముందు దోషులుగా నిలవడం సంచలనంగా మారుతోంది.
అవును... భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాల్సిన వయసులో కొంతమంది యువకులు పనికిమాలిన పనులకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. యువతలో పలువురు చైల్డ్ పో*ర్న్ వీడియోలు చూడటంతో పాటు పలువురికి షేర్ చేస్తూ కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా 10 - 16 ఏళ్ల లోపు వారు ఇలాంటి వాటికి బానిసలవుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజయవాడలో ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం.
పలు ఫేక్ వెబ్ సైట్లు, పైరసీ సినిమాలకు సంబంధించిన వెబ్ సైట్లు చూస్తున్న క్రమంలో వచ్చే పాప్ అప్ ల కారణంగా పలు పో*ర్న్ సైట్లు, చైల్డ్ పో*ర్న్ వ్యవహారాలు ఓపెన్ అవ్వడం.. వాటిని చూసి, అలావాటు పడటం, క్రమంగా వాటిని బానిసలు అవ్వడంతో పాటు వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులకు యువత పాల్పడుతున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గత ఏడాదు సుమారు 700 మందిపై విజయవాడ నగరంలోనే కేసులు నమోదయ్యాయి.
ఐటీ చట్టంలోని 67 బీ సెక్షన్ ప్రకారం చిన్నారులకు సంబంధించి దుస్తులు లేకుండా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం నేరం. ఇదే సమయంలో.. పోక్సో చట్ట ప్రకారం యుక్త వయసులోపు వారితో ఇలాంటి చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం.. ఈ విషయాలు తెలియకో.. లేక, తాము చూస్తున్నామన్న విషయం ఎవరికీ తెలియదనో తెలియదు కానీ.. ఈ తరహా అలవాట్లకు 10 నుంచి 16 ఏళ్ల లోపు వారు ఎక్కువగా బానిసలవుతున్నారని అంటున్నారు.
ఈ సమయంలో ఇలాంటి పనులకు పాల్పడిన వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల్ వరకూ జరిమానా విధిస్తారని చట్టం చెబుతోంది! అయితే ఇది తొలి నేరానికి మాత్రమే. ఇదే పని రెండోసారి చేస్తే... శిక్ష ఏడేళ్ల వరకూ పెరుగుతుంది!
