Begin typing your search above and press return to search.

ఇది హోటల్ గదే.. మీరు నమ్మాలి.. వీడియో వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... ఫైనాలోని జిలిన్ ప్రావిన్స్ లోని చాంగ్ చున్ లో గల ఆన్ లైన్ గేమింగ్ హోటల్ లో ఓ అతిథి చెక్ ఇన్ చేశాడు.

By:  Raja Ch   |   22 Dec 2025 9:00 PM IST
ఇది హోటల్  గదే.. మీరు నమ్మాలి.. వీడియో వైరల్!
X

మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఎంత ఆన్ లైన్ గేమ్స్ పై పిచ్చి ఉంటే మాత్రం తాము మనుషులమన్న విషయం మరిచిపోతారా.. ఒక గదిలో సుమారు రెండేళ్ల పాటు మూడు అడుగుల ఎత్తులో చెత్త పేరుకునిపోయినా అక్కడే ఉంటారా.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే షాకింగ్ సమాధానం చెప్పే ఓ ఘటన చైనాలోని ఓ హోటల్ లో చోటు చేసుకుంది. ఈ గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బందికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ఆన్ లైన్ గేమ్స్ కి బానిసైన ఓ వ్యక్తి చైనాలోని ఓ ఆన్ లైన్ గేమింగ్ హోటల్ (ఈ-స్పోర్ట్స్ హోటల్)లో సుమారు రెండేళ్లు బస చేశాడు. అతడు ఇటీవల చెక్ అవుట్ చేసిన తర్వాత ఆ గదిలోనూ, వాష్ రూమ్ లోనూ ఉన్న సుమారు 3 అడుగుల ఎత్తు చెత్త కుప్పలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చెక్ అవుట్ అనంతరం ఆ గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బంది అక్కడ పరిణామాలను చూసి షాకయ్యారంట.

వివరాళ్లోకి వెళ్తే... ఫైనాలోని జిలిన్ ప్రావిన్స్ లోని చాంగ్ చున్ లో గల ఆన్ లైన్ గేమింగ్ హోటల్ లో ఓ అతిథి చెక్ ఇన్ చేశాడు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెటప్ లు, హై-స్పీడ్ ఇంటర్నెట్, ఎర్గోనామిక్ కుర్చీలతో గేమింగ్ ప్రియులకు సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో ఈ హోటల్ లో చెక్ ఇన్ అయిన ఓ వ్యక్తి సుమారు రెండేళ్ల పాటు నిరంతరాయంగా లోపల పడిపాడు. ఎప్పుడైనా అరుదుగా ఒకసారి అలా బయటకు వెళ్లేవాడట. అది కూడా చాలా తక్కువ సమయం!

పైగా బయటకు వెళ్లేటప్పుడు ఫేస్ ను పూర్తిగా కవర్ చేసుకునేవాడని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో 2023లో హోటల్ లో చెక్ ఇన్ అయిన వ్యక్తి డిసెంబర్ 21 - 2025న చెక్ అవుట్ అయ్యాడంట. దీంతో.. ఆ రూమ్ క్లీన్ చేద్దామని గదిలోకి వెళ్లిన సిబ్బంది అక్కడి భయానక దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. పాత టేక్ అవే కంటైనర్లు, ఖాళీ డ్రింక్ బాటిళ్లు, ఫుడ్ రేపర్లు గదిలోని ప్రతీ అంగులంలోనూ పేరుకుపోయాయి.

ఇక బాత్ రూమ్ సంగతి చెప్పే పనేలేదు. అక్కడ తడిచిన టిష్యూ పేపర్ లు టాయిలెట్ కంటే ఎత్తులో పేర్చబడి ఉన్నాయి. వీటితో వాష్ బేసిన్ మూసుకుపోయింది. నేలపై పసుపు రంగు ధూళి మందపాటి పొరలా కప్పబడి ఉంది. ఈ గజిబిజి పరిస్థితులనుంచి ఆ గదిని శుభ్రం చేయడానికి సిబ్బంధికి మూడు రోజులు పట్టిందని చెబుతున్నారు. పైగా ఇంకా 10 రోజుల గది అద్దె చెల్లించాల్సి ఉండగానే.. చెప్పాపెట్టకుండా అతడు చెక్ అవుట్ చేసినట్లు చెబుతున్నారు.