గాలి నుంచి నీటిని పట్టేసే మెషీన్.. నోబెల్ విజేత తాజా ఆవిష్కరణ
అవును.. గాలి నుంచి నీటిని క్రియేట్ చేస్తే.. అంతకు మించిన అద్భుతం ఏముంటుంది. తాజాగా ఆ ఘనతను సాధించారు ప్రొఫెసర్ ఒమర్ యాగీది.
By: Garuda Media | 25 Feb 2026 1:00 PM ISTఅవును.. గాలి నుంచి నీటిని క్రియేట్ చేస్తే.. అంతకు మించిన అద్భుతం ఏముంటుంది. తాజాగా ఆ ఘనతను సాధించారు ప్రొఫెసర్ ఒమర్ యాగీది. ఇప్పటివరకు ఊహలకు పరిమితమైన ఒక అద్భుత యంత్రాన్ని రూపొందించారు ఈ నోబెల్ గ్రహీత. ప్రపంచ వ్యాప్తంగా నీటి లభ్యత నానాటికీ ప్రమాదకరస్థాయికి పడిపోతున్న వేళ.. నీటి కటకట పెరుగుతున్న నేపథ్యంలో ఈ అద్భుత యంత్రాన్ని రూపొంచింటం ద్వారా ప్రపంచానికి ఒక వరాన్ని అందించారని చెప్పాలి. అత్యంత స్వచ్ఛమైన నీటిని నేరుగా గాలి నుంచే సులువుగా తయారు చేసే ఈ టెక్నాలజీని ఆవిష్కరించటం ద్వారా ప్రపంచ నీటి కటకటకు కొత్త పరిష్కారాన్నిరూపొందించినట్లు అవుతుందని చెప్పాలి.
ఇందుకోసం భారీ ఫ్లాంట్లు.. పరికరాల అవసరాలు లేకుండా కేవలం ఒక షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే యంత్రాన్ని రూపొందించారు. ప్రొఫెసర్ యాగీకి రూపొంచింది మెషీన్ సాయంతో రోజుకు కనీసం వెయ్యి లీటర్ల నీటిని నేరుగా గాలి నుంచే ఒడిసిపట్టేలా దీన్ని రూపొందించారు. అత్యంత పొడి వాతావరణం ఉండే ఎడారి ప్రాంతాల్లోనూ ఈ టెక్నాలజీతో స్వచ్ఛమైన నీటిని క్రియేట్ చేసేలా దీన్ని రూపొందించారు. అన్ని ప్రాంతాల్లోనూ బాగా పని చేస్తున్నట్లుగా తేల్చారు.
గత ఏడాది (2025)లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని సొంతం చేసుకునన ప్రొఫెసర్ యాగీకి చెందిన డీప్ టెక్ కంపెనీ ఆటోకో గాలి నుంచి నీటిని సేకరించే సాంకేతికత మీద ఎన్నో ఏళ్లుగా పరిశోధన చేస్తోంది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఈ ఎంఓఎఫ్ లను నీటిని పీల్చుకునే స్పాంజీలతో పోలుస్తున్నారు. అయితే.. ఇవి అత్యాధునిక అణు స్పాంజీలుగా చెబుతున్నారు. గాలిలో తేమ.. కనిపించని వాయువులను ఇది శోషింరుకోవటం ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా గాలి నుంచి నీటిని సేకరించే ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. తాజా ఆవిష్కరణ మాత్రం అందుకు భిన్నంగా సహజ ప్రక్రియ ద్వారా గాలిలోని నీటి అణువులను నేరుగా ఆకర్షిస్తాయని చెబుతున్నారు.
మరింత సింఫుల్ గా చెప్పాలంటే గాల్లో ఉన్న నీటిని ఆయస్కాంతం మాదిరి ఆకర్షించటం దీని ప్రత్యేకత. ఎలాంటి కాలుష్యం లేని అత్యంత స్వచ్ఛమైన నీటిని సమకూర్చేలా ఈ యంత్రాన్ని రూపొందించారు. సూర్యుడి నుంచి వేడితోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండటం మరో విశేషంగా చెబుతున్నారు. సాధారణంగా ఏడారి గాలుల్లో నీటి అణువులు తక్కువగా ఉంటాయి. అయితే.. తాజా యంత్రం తేమ 10 శాతం మాత్రమే ఉండే అత్యంత పొడి వాతావరణంలోనూ నీటి అణువులను తమకేసి ఆకర్షించేలా ఈ యంత్రం ఉందని చెబుతున్నారు.
భారత్ లోనూ గాలి నుంచి నీటి తయారీకి అక్వో అనే దేశీయ కంపెనీ వాటర్ జనరేటర్లను రూపొంచింది. ఈ యంత్రం సాయంతో మధ్యప్రదేశ్ లోని మంగ్రా ప్రాంతంలో 1500 మంది దాహార్తిని తీరుస్తుంది. దీనికి భిన్నంగా తాజా యంత్రాన్ని ఆవిష్కరించినట్లు చెబుతన్నారు. ఇక.. ప్రొఫెస్ యాగీది బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. జోర్డాన్ లోని శరణార్ధి శిబిరాల్లో పెరిగారు. నిత్యం దాహార్తిని చవిచూసిన ఆయన.. తన జీవితంలో ఎదురైన చేదు ఘటనలకు పరిష్కారంగా ఈ అద్భుత యంత్రాన్ని ఆవిష్కరించారని చెప్పొచ్చు. ప్రొఫెసర్ యాగీ రూపొంచిందిన ఈ యంత్రం ప్రపంచానికి నీటి కొరతను మార్చేసే శక్తి ఉందంటున్నారు. అదే జరిగితే.. అంతకు మించి కావాల్సిందేముంది?
