కో-వర్కర్ తో రొమాన్స్.. ఇంట్లో వాళ్ళకి టెన్షన్.. ఆఫీసుల్లో పెరిగిన 'ప్రేమ' ప్రొడక్టివిటీ!
ఆధునిక కార్పొరేట్ ఆఫీసులంటే కేవలం ప్రాజెక్టులు.. డెడ్ లైన్లు మాత్రమే కాదు... అప్పుడప్పుడు కొన్ని 'ప్యారే' ముచ్చట్లు కూడా! తాజాగా ఫోర్బ్స్ బాంబు పేల్చింది.
By: A.N.Kumar | 10 May 2026 10:02 AM ISTఆధునిక కార్పొరేట్ ఆఫీసులంటే కేవలం ప్రాజెక్టులు.. డెడ్ లైన్లు మాత్రమే కాదు... అప్పుడప్పుడు కొన్ని 'ప్యారే' ముచ్చట్లు కూడా! తాజాగా ఫోర్బ్స్ బాంబు పేల్చింది. అమెరికాలో 40 శాతం మంది తమ భాగస్వాములు ఆఫీసులో సహోద్యోగులతో ఏదో "లవ్లీ" ట్రాక్ నడుపుతున్నారని అనుమానిస్తున్నారట. ఇక మన దగ్గర కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే వారి "సందేహాలే" వేగంగా అప్‌డేట్ అవుతున్నాయంటే నమ్మండి!
9 నుంచి 6 డ్యూటీ.. మనసుతో కుస్తీ!
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. కానీ ఇప్పుడు పెళ్లంటే 'ప్రాజెక్టు మేనేజర్‌తో పీర్ రివ్యూ' అన్నట్లుగా మారింది. ఇంట్లో పెళ్లయిన భాగస్వామితో గడిపేది కేవలం నాలుగు గంటలైతే.. ఆఫీసులో కొలీగ్స్‌తో గడిపేది ఎనిమిది నుంచి పది గంటలు. పొద్దున్నే కాఫీ నుంచి సాయంత్రం క్యాబ్ ఎక్కే వరకు అన్నీ షేర్ చేసుకుంటే ఆ తర్వాత 'షేరింగ్' కాస్తా 'కేరింగ్' గా మారకుండా ఎలా ఉంటుంది?
సర్వేలో తేలిన మరో విచిత్రం ఏమిటంటే.. దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులో ఫ్లర్టింగ్ చేశామని ఒప్పుకున్నారు. అంటే వీరు కేవలం జీతం కోసమే కాదు.. కాస్త 'జీవితం' కోసం కూడా ఆఫీసుకి వస్తున్నారన్నమాట! కోడ్ రాయడం కంటే కళ్లతో సైగలు చేయడం, ఈమెయియిల్స్ కంటే వాట్సాప్ చాటింగ్స్‌లో వేగం పెంచడం ఇప్పుడు కొత్త వర్క్ కల్చర్ అయిపోయింది.
అనుమానం పెనుభూతం.. ఆఫీసు కాల్ 'విషం'!
సర్వేలో పాల్గొన్న వారిలో 57 శాతం మందికి తమ పార్ట్‌నర్ ప్రవర్తన చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని ఫిక్సయ్యారట. రాత్రి 9 గంటలకి "అర్జెంట్ మీటింగ్" అని ఫోన్ వస్తే అది ఆఫీస్ మీటింగా? లేక 'కాఫీ' మీటింగా? అని ఇంట్లో భాగస్వామికి వచ్చే అనుమానం చిన్నది కాదు. ఆఫీసు లాప్‌టాప్‌లో పాస్‌వర్డ్‌లు పెరిగినా ఫోన్ పట్టుకుని బాత్రూంలోకి దూరినా ఇక అక్కడ 'రొమాన్స్' మొలకెత్తిందని అర్థం. అది టీమ్ లంచా లేక 'తీపి' లంచా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
హెచ్ఆర్ ల తలపోటు.. ప్రొఫెషనల్ బాబూ!
హెచ్ఆర్ నిపుణులు మాత్రం నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. ఆఫీసులో అఫైర్స్ పెరిగితే పనితీరు తగ్గుతుందట. ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడుతుంటే.. ఇక్కడ వీరు ఒకరికొకరు 'డెడ్లీ' లుక్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే కంపెనీకి లాభాలు కాదు కదా.. కనీసం టీ పొడి ఖర్చులు కూడా రావు. ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి కేవలం నోటీసు బోర్డుకే పరిమితం అయిపోతున్నాయి.
లవ్ ఈజ్ ఇన్ ది 'ఎయిర్ కండీషనర్'
నిపుణులు చెప్పేది ఒకటే.. మనుషుల మధ్య అనుబంధం సహజమే, కానీ అది ఆఫీస్ డెస్క్ దాటి బెడ్ రూమ్ వరకు రాకూడదు. "వర్క్ ఫ్రమ్ హోమ్" ఉన్నప్పుడు పర్వాలేదు కానీ.. "వర్క్ ఫ్రమ్ హార్ట్" మొదలైతేనే అసలు చిక్కు. మీ పార్ట్‌నర్ ఆఫీసుకి వెళ్తుంటే అది కేవలం జీతం కోసమే అని నమ్మే రోజులు పోయాయి.
కాబట్టి ఆఫీసులో మీరు పెంచుకోవాల్సింది కేవలం మీ "స్కిల్స్" మాత్రమే.. మీ "అఫైర్స్" కాదు! లేదంటే రేపు మీ భాగస్వామికి ఫోర్బ్స్ సర్వే కంటే భయంకరమైన నిజాలు తెలిస్తే ఆఫీసు అప్రైజల్ కంటే ఇంట్లో వచ్చే "డిస్మిస్ ఆర్డర్" చాలా ఖరీదుగా ఉంటుంది!
