Begin typing your search above and press return to search.

ఎఫైర్ పెట్టుకున్నాడు.. చైనా గుఢచర్యంలో ఇరుక్కున్నాడు.. ఎన్విడియో సీఈవో వివాదమిదీ..

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం, చైనా గూఢచర్య ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ ఇయాన్ కింగ్ కథనం ప్రకారం, వివాహేతర సంబంధం గురించి కుటుంబానికి నిజం చెప్పి పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. సింగపూర్ మహిళా వ్యాపారవేత్తతో సంబంధాల నేపథ్యంలో చైనా నిఘా వర్గాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించినట్లు కథనం పేర్కొంది.

By:  A.N.Kumar   |   9 Nov 2026 12:11 PM IST
ఎఫైర్ పెట్టుకున్నాడు.. చైనా గుఢచర్యంలో ఇరుక్కున్నాడు.. ఎన్విడియో సీఈవో వివాదమిదీ..
X

ఎంత పెద్ద వ్యక్తి అయినా కాంత దాసుడే అంటారు. మహిళలకు లొంగని.. బెండ్ అవ్వని మొగాడు ఉండరంటారు. అంతపెద్ద కంపెనీ సీఈవో అయినా కూడా ఓ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని.. చైనా గూఢచర్యంలో చిక్కుకొని ఇప్పుడు విలవిలలాడుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అద్భుత ప్రపంచాన్ని తన భుజాలపై మోస్తూ.. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని తిరుగులేని రీతిలో శాసిస్తున్న మహామహుడతను... ఎన్విడియా సంస్థను కేవలం ఒక కంపెనీగా కాకుండా భవిష్యత్ ప్రపంచానికి దిక్సూచిగా మార్చిన విజనరీ లీడర్ జెన్సన్ హువాంగ్. అలాంటి ఒక అగ్రగామి వ్యక్తి ఇప్పుడు ఊహించని వ్యక్తిగత వేదనలో.. నైతిక సంక్షోభంలో చిక్కుకున్నారు. విజయాల మెట్లెక్కిన ఆ చేతులే తన జీవితంలో జరిగిన పొరపాటును తలచుకుని కలవరపడుతుంటే.. ఆ కన్నీటి తెరవెనుక ఉన్న ఆవేదన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

జీవితంలో ఏ ఎత్తుకు ఎదిగినా.. భార్యాపిల్లల ప్రేమ, కుటుంబం ఇచ్చే నైతిక బలమే మనిషికి అసలైన సంపద. కానీ కొన్నిసార్లు చిన్న చూపులు, పొరపాట్లు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి. బ్లూమ్‌బర్గ్‌ జర్నలిస్ట్ ఇయాన్ కింగ్ వెల్లడించిన కథనాల ప్రకారం.. జెన్సన్ హువాంగ్ తన వివాహేతర సంబంధం గురించి నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా తన వెన్నంటి నిలిచిన భార్య, తనను నమ్ముకున్న పిల్లలు ఈ వార్తతో పడిన మనోవేదనను తలచుకుని ఆయన కుంగిపోయినట్లు సమాచారం. తన వ్యక్తిగత ప్రవర్తన తన కుటుంబాన్ని ఎంతగా క్షోభకు గురిచేసిందో గ్రహించి "నా చర్యలను సమర్థించుకోలేను" అంటూ వారు క్షమించమని వేడుకున్న ఆ క్షణాలు ఆయనలో ఎంతటి పశ్చాత్తాపాన్ని నింపి ఉంటాయో ఊహించడానికే కష్టంగా ఉంది.

వ్యక్తిగత జీవితంలోని ఆ పొరపాటు కేవలం ఇంటి నాలుగు గోడల మధ్య ఆగిపోలేదు. అంతర్జాతీయ రాజకీయాల పావుగా.. గూఢచర్యపు కుట్రల వలయంలోకి ఆయన్ని నెట్టేసింది. సింగపూర్‌కు చెందిన ఒక మహిళా వ్యాపారవేత్తతో ఆయనకున్న సంబంధాలు ఇప్పుడు చైనా నిఘా వర్గాల కంట్లో పడ్డాయనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్ టెక్నాలజీని గుప్పిట్లో పెట్టుకున్న ఎన్విడియా అధిపతిని లక్ష్యంగా చేసుకుని.. చైనా వర్గాలు సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశాయా అనే అనుమానాలు పెను తుఫానును సృష్టిస్తున్నాయి.

తను ఎంతో కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం.. తనపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఉంచిన విశ్వాసం.. ఇవన్నీ ఒకవైపు కళ్లముందు కదులుతుంటే మరోవైపు కుటుంబం పట్ల తను చేసిన తప్పు తాలూకు భారంతో జెన్సన్ హువాంగ్ నలిగిపోతున్నారు. ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించినా ఆయన మాత్రం తన పదవిలో కొనసాగుతూ విచారణను ఎదుర్కొంటున్నారు.

మనుషులెవవారూ తప్పుల నుంచి పూర్తిగా అతీతులు కాదనే సత్యానికి జెన్సన్ హువాంగ్ ఉదంతం మరో నిదర్శనంగా నిలిచింది. కీర్తి ప్రతిష్ఠల శిఖరాగ్రాన ఉన్న ఒక వ్యక్తి.. వ్యక్తిగత బలహీనత కారణంగా ఎంతటి క్షోభను అనుభవించాల్సి వస్తుందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ఆ విజయాల ముసుగులో ఉన్న ఆవేదన.. ఆ మానసిక సంఘర్షణ ఇప్పుడు ప్రపంచ టెక్ ట్రేడింగ్ వర్గాల్లో ఒక విషాద గీతంలా వినిపిస్తోంది.