Begin typing your search above and press return to search.

అణు యుద్ధంతో ప్రపంచం మొత్తం నాశనమైనా.. ఆ రెండు దేశాలు మాత్రం సురక్షితం..!

ప్రపంచం ఒక అణుయుద్ధాన్ని (అమెరికా జపాన్ పై జరిపిన దాడి) చూసింది. ఆ తర్వాత అణుయుద్ధంపై చాలా ఆంక్షలు మొదలయ్యాయి.

By:  Tupaki Political Desk   |   28 April 2026 4:00 PM IST
అణు యుద్ధంతో ప్రపంచం మొత్తం నాశనమైనా.. ఆ రెండు దేశాలు మాత్రం సురక్షితం..!
X

ప్రపంచం ఒక అణుయుద్ధాన్ని (అమెరికా జపాన్ పై జరిపిన దాడి) చూసింది. ఆ తర్వాత అణుయుద్ధంపై చాలా ఆంక్షలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య అణు యుద్ధం గురించి చర్చలు జరుగుతున్నప్పుడల్లా అప్పుడు జరిగిన వినాశనమే గుర్తొస్తుంది. ఒకవేళ పొరపాటున అగ్రరాజ్యాల మధ్య అణు దాడి జరిగితే, ఇండియా, చైనా, అమెరికా వంటి దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కానీ, శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు క్షేమంగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘మూడో ప్రపంచ యుద్ధం’ వస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఒకవేళ అణు యుద్ధం సంభవిస్తే, అది కేవలం పేలుళ్లతోనే ఆగదు.. ‘న్యూక్లియర్ వింటర్’ పేరుతో భూమిపై సూర్యరశ్మి పడకుండా నల్లటి పొగ మేఘాలు కమ్మేస్తాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి పంటలు పండవు. 'రిస్క్ అనాలిసిస్' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.., ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు మాత్రమే ఇటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడగలవని తేలింది.

ఎందుకు ఆ రెండు దేశాలే తట్టుకుంటాయి?

ప్రపంచంలోని మెజారిటీ అణు లక్ష్యాలు ఉత్తర అర్ధగోళంలో (అమెరికా, యూరప్, రష్యా, చైనా) ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు దక్షిణ అర్ధగోళంలో, ప్రధాన భూభాగాలకు దూరంగా ఉండడం వల్ల నేరుగా బాంబు దాడులకు గురయ్యే ప్రమాదం తక్కువ. ఈ రెండు దేశాలు చుట్టూ సముద్రంతో ఉండడం వల్ల, అణు శీతాకాలంలో భూభాగం అంత వేగంగా చల్లబడదు. సముద్రపు గాలి ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తుంది. ఒక వేల అణు యుద్ధం సంభవించి ఉంటే తర్వాత ప్రపంచం ఆకలితో అలమటించే అవకాశం ఉంది. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు తమ జనాభా కంటే చాలా రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. కోట్లాది మందికి సరిపడా అదనపు నిల్వలు ఈ దేశాల సొంతం. ఆస్ట్రేలియాలో బొగ్గు, గ్యాస్, ఇతర ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆరోగ్య, రక్షణ వ్యవస్థలు విపత్తు సమయాల్లో ప్రజలను కాపాడగలవు.

అసలైన ముప్పు న్యూక్లియర్ వింటర్

అణు బాంబు పేలినప్పుడు వచ్చే మంటల కంటే, దాని వల్ల పుట్టే పొగ సూర్యుడిని అడ్డుకోవడం వల్ల కలిగే నష్టం ఎక్కువ. చైనా, ఇండియా విషయాలకు వస్తే ఈ దేశాలు జనాభా పరంగా పెద్దవి, ఉత్తర అర్ధగోళంలో ఉండడం వల్ల, ఆహార ఉత్పత్తి పడిపోతే కోట్లాది మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియాలో తక్కువ జనాభా, విశాల సాగు భూమి వల్ల స్వయం సమృద్ధిని సాధించగలరు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సురక్షితం అని చెప్పినప్పటికీ ఏ దేశమైన ఒంటరిగా జీవిచడం దాదాపు అసాధ్యం. ఒక వేళ జీవించినా అది కొంత కాలం మాత్రమే. కొన్ని దేశాలు భౌగోళికంగా బయటపడినప్పటికీ, మానవాళి మనుగడకు అణు యుద్ధం శాపమనే చెప్పాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ భౌగోళిక స్థితి రక్షణ కవచం కావచ్చు, కానీ మానవత్వం గెలవాలంటే యుద్ధమే వద్దు!