'ఎన్టీఆర్' పేరు మార్చండి: టీడీపీ డిమాండ్ ..!
ఈ క్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది.
By: Garuda Media | 25 Nov 2025 12:42 AM ISTచిన్న ఎఫర్ట్‌తో పెద్ద ప్రయోజనం అంటే.. ఎవరైనా ముందుకు వస్తారు. పైగా రాజకీయాల్లో అయితే.. మరిం త ఎక్కువగా చొరవ చూపిస్తారు. తద్వారా ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తా రు. ఇప్పుడు అలాంటి అవకాశమే.. కూటమి సర్కారుకు వచ్చింది. త్వరలోనే జిల్లాలను ఏర్పాటు చేయడం.. లేదా విస్తరించడం.. సరిహద్దులు మార్పు చేయడం కొత్త మండలాల సృష్టి వంటివాటిని చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది.
ఈ క్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ జిల్లాల ఏర్పాటు, మార్పు చేర్పులు, మండలాల సరిహద్దుల మార్పు వంటివిషయాలపైదృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు పేర్లు కూడా మార్చనున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాగా ఉన్న గుంటూరులోని కొంత ప్రాంతానికి గుర్రం జాషువా లేదా.. బ్రహ్మనాయుడు జిల్లా పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే.. విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చనున్నారని తెలిసింది.
నిజానికి ఎన్టీఆర్ పుట్టింది.. నిమ్మకూరు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గం గుడివాడ. ఇవి ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నాయి. కానీ, ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు పెట్టారు. దీనిపై అప్పట్లోనే టీడీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతించిన నాయకులు.. ఆయన పేరుకు తగిన విధంగా గౌరవం లభించలేదని పెదవి విరిచారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాకు కృష్ణానది పేరు పెట్టాలని చెబుతున్నారు.
దీనికి కారణం.. కృష్ణానది పెద్ద ఎత్తున విజయవాడ నగరం నుంచే వెళ్తోంది. దీంతో ఈ జిల్లాకు కృష్ణ అని.. ఎన్టీఆర్ పుట్టి పెరిగి, పోటీ కూడా చేసిన ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయి. అంతేకాదు.. ఇప్పటికి ఆల్రెడీ.. విజయవాడలో ఉన్న వైద్య విశ్వవిద్యాల యానికి ఎన్టీఆర్ పేరు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పేరును మా ర్పు చేయాలని కోరుతున్నారు. ఇదే జరిగితే.. ఎన్టీఆర్‌ను నిబద్ధతతో గుర్తించినట్టు అవుతుందని కూడా టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
