Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గీతాకృష్ణ పై నాన్ బెయిలబుల్ కేసు.. వదిలేదే లేదంటున్న మహా సేన రాజేశ్

మైక్ కనపడగానే రెచ్చిపోయి రచ్చ చేసే వారిని ఎందరినో చూస్తుంటాం.. కానీ దేనికైనా సెన్సార్ ఉండాలి.

By:  A.N.Kumar   |   28 Nov 2025 3:56 PM IST
డైరెక్టర్ గీతాకృష్ణ పై నాన్ బెయిలబుల్ కేసు.. వదిలేదే లేదంటున్న మహా సేన రాజేశ్
X

మైక్ కనపడగానే రెచ్చిపోయి రచ్చ చేసే వారిని ఎందరినో చూస్తుంటాం.. కానీ దేనికైనా సెన్సార్ ఉండాలి. అడ్డూ అదుపు ఉండాలి. అది లేకుంటే మరింత రెచ్చిపోతారు. దర్శకుడు గీతాకృష్ణ కూడా ఇన్నాళ్లు ఏది మాట్లాడినా చెల్లింది. కానీ ఇక చెల్లదు. ఎందుకంటే ఆయన రిజర్వేషన్స్ మీద దారుణమైన మాటలు మాట్లాడి ఇరుక్కున్నారు. మహా సేన రాజేష్ దీన్ని సీరియస్ గా తీసుకొని కేసులు పెట్టించారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ సినీ దర్శకుడు గీతాకృష్ణ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మాల, మాదిగ సామాజిక వర్గాలపై అనుచిత, దారుణమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయనపై, అలాగే ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.

* మహాసేన రాజేష్ పట్టుదల: న్యాయ పోరాటం ఖాయం

తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ "అడుక్కుతింటున్నారని రిజర్వేషన్లు ఇచ్చారు" అంటూ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహాసేన రాజేష్ తీవ్రంగా మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా పేరున్న రాజేష్ తాజాగా గీతాకృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు డైరెక్టర్ గీతాకృష్ణతో పాటు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్ యాజమాన్యం , యాంకర్‌పై కూడా క్రైమ్ నంబర్ 235/2025 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.

* ఛానెల్‌పై కేసు నమోదుకు కారణం

రాజేష్ మహాసేన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇంటర్వ్యూ లైవ్ ప్రోగ్రాం కానప్పటికీ అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగాన్ని ఎడిట్ చేసి తొలగించే అవకాశం ఉన్నా కూడా ఛానెల్ యాజమాన్యం వాటిని ప్రసారం చేసింది. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలను పబ్లిక్‌లోకి తీసుకెళ్లినందుకు గాను ఛానెల్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

* వివాదాస్పదంగా గీతాకృష్ణ శైలి

డైరెక్టర్ గీతాకృష్ణ వ్యవహారశైలి గతంలో కూడా పలుమార్లు వివాదాస్పదమైంది. అనేక అంశాలపై, ముఖ్యంగా సినిమా హీరో, హీరోయిన్లపై ఆయన ఇష్టానుసారం మాట్లాడటం.. వివాదాస్పద సమాధానాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు ఆయనపై సరైన చట్టపరమైన చర్యలు లేకపోవడంతో నోటికి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎస్సీలపై వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహాసేన రాజేష్ పట్టుదలతో వేసిన ఈ కేసుతో ఆయనకు ఇకపై అంత తేలికగా ఉండదని తెలుస్తోంది.

* రిజర్వేషన్లపై మహాసేన రాజేష్ వివరణ

డైరెక్టర్ గీతాకృష్ణ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, రిజర్వేషన్లు మాల, మాదిగలకు మాత్రమే కాదని, అన్ని కులాలకు ఉన్నాయని మహాసేన రాజేష్ వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటారని ఆయన గీతాకృష్ణను హెచ్చరించారు. ఈ కేసు తరువాతనైనా గీతాకృష్ణ తన ఇంటర్వ్యూలు బంద్ చేసుకుంటారేమో చూడాలి.