వివాహిత నిక్కీ దారుణ హత్యలో బయటకు వచ్చిన షాకింగ్ నిజాలు
అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేసి.. యాసిడ్ పోసి నిప్పు అంటించిన నోయిడా భర్త దుర్మార్గం దేశ వ్యాప్తంగా పెను సంచలనానికి గురి చేసింది.
By: Garuda Media | 25 Aug 2025 4:27 PM ISTఅదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేసి.. యాసిడ్ పోసి నిప్పు అంటించిన నోయిడా భర్త దుర్మార్గం దేశ వ్యాప్తంగా పెను సంచలనానికి గురి చేసింది. భర్త.. అత్తమామలు చిత్రహింసలు ఎంత దారుణంగా ఉన్నాయన్నది వీడియో వైరల్ కావటంతో వీరి దుర్మార్గం అందరికి తెలిసేలా చేసింది. ఈ ఉదంతానికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నిక్కీ.. ఆమె సోదరి కాంచన్ ను ఒకే ఇంట్లోని అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరగటానికి ముందు వీరు కొంతకాలం బ్యూటీపార్లర్ నడిపేవారు.
పెళ్లి తర్వాత వీరిద్దరూ మళ్లీ బ్యూటీపార్లర్ మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. దీన్ని నిక్కీ భర్త విపిన్.. అత్తమామలు కూడా ఒప్పుకోలేదు. దీంతో వారి మీద వాగ్వాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తమ బ్యూటీ పార్లర్ ను ప్రమోట్ చేయటానికి నిక్కీ కాంచన్ లకు సంబంధించి ‘మేక్ ఓవర్ బై కాంచన్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాలో నడిపేవారు. వీరి ఇన్ స్టా ఖాతాకు54,500 మంది ఫాలోవర్లు ఉండేవారు. నిక్కీ ప్రైవేటు ఖాతాకు 1147మంది పాలోవర్లు ఉండగా.. కాంచన్ ఖాతాకు 22 వేల మంది ఫాలోవర్లు ఉండేవారు.
ఒకే కుటుంబానికి చెందిన కాంచన్.. నిక్కీలను ఒకే ఇంటికి 2016లో పెళ్లి చేసి పంపారు.ఇద్దరిని అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టేవారని అమ్మాయిల తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇద్దరు అన్నదమ్ములకు వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవని.. దీనికి సంబంధించి వీరి కుటుంబాల్లో గొడవలు అయినట్లుగా నిక్కీ సోదరి కాంచన్ తెలిపింది. ఇక.. నిక్కీ కొడుక్కి ఆరేళ్లు. తను చూస్తుండగానే తండ్రి.. నాయనమ్మలు కలిసి తన తల్లిని దారుణంగా హింసించి.. సజీవదహనం చేసిన వైనం పోలీసులకు చెప్పిన తీరు అందరి కంట కన్నీరు పెట్టేలా చేసింది. ‘అమ్మను నాన్న.. నానమ్మ చెంప మీద కొట్టారు. ఆమె పెద్దగా అరిచింది. మండే వస్తువును అమ్మ మీద పోశారు. ఆ తర్వాత నాన్న లైటర్ తో నిప్పు పెట్టారు’ అంటూ చెప్పిన వైనం పోలీసుల్ని సైతం కదిలిపోయేలా చేసిందని చెబుతున్నారు.
