ట్రంప్ రాజ్యంలో ‘నో కింగ్స్3’ నిరసనలు.. ఎంత పెద్దదంటే?
వీకెండ్ వేళ.. అమెరికా వ్యాప్తంగా మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ‘నో కింగ్స్’ పేరుతో నడుస్తున్న నిరసనలు ఇప్పుడు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.
By: Garuda Media | 29 March 2026 10:01 AM ISTఆ దేశాన్ని చక్కదిద్దుతాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. ఈ దేశం నాకు నచ్చట్లేదు. దాన్ని బాగుచేయాలంటూ.. పిచ్చోడి చేతిలో రాయిలా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రపంచానికి పెద్దన్న కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ప్రపంచానికి శాంతి లేకుండా చేసిన ట్రంప్ నకు వ్యతిరేకంగా ఇప్పుడు సొంత దేశంలో సొంత ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద నిరసనల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
వీకెండ్ వేళ.. అమెరికా వ్యాప్తంగా మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ‘నో కింగ్స్’ పేరుతో నడుస్తున్న నిరసనలు ఇప్పుడు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. అమెరికా చరిత్రలోనే ఇవి అతి పెద్ద ఆందోళనలుగా అభివర్ణిస్తున్నారు. గత అక్టోబరులో సుమారు 70 లక్షల మంది పాల్గొంటే.. తాజా నిరసనల్లో ఏకంగా 90 లక్షల మంది వరకు వీధుల్లోకి రావటం గమనార్హం. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 90 లక్షల మంది వరకు వీధుల్లోకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.
ఈసారి ఆందోళనల్లో ప్రత్యేకత ఏమంటే.. 50 రాష్ట్రాల్లో దాదాపు 3200లకు పైగా ప్రదేశాల్లో ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే కాదు.. రిపబ్లికన్లకు పట్టు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి నిరసనలు జరగటం గమనార్హం. అమెరికాలో ప్రధాన నగరాలైన వాషింగ్టన్ డీసీ.. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో భారీ జనసమూహం కనిపించింది. సెయింట్ పాల్ మిన్నెసోటాలో జరిగిన ర్యాలీలో ప్రఖ్యాత సింగర్ బ్రూస్ స్పింగస్టీన్ పాల్గొనటం విశేషం. అంతేకాదు.. ఈ ఆందోళనల్లో డెమోక్రాట్ల అగ్రనాయకత్వ కూడా హాజరు కావట చూస్తే.. ట్రంప్ మీద వ్యతిరేకత అంతకంతకూ ముదురుతున్న విషయం స్పష్టవుతోందని చెప్పాలి.
కాలిఫోర్నియా గవర్నర్ ఈ నిరసనల్ని నిరంకుశత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ప్రకటనగా పేర్కొంటున్నారు. ఈ ఆందోళనలు కేవలం పార్టీ ఏజెంట్ల ఎజెండా మాత్రమే కాదని. రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ సభ్యులు మాత్రమే కాదు స్వతంత్రులుగా పోటీ చేసిన వారు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు. వీరంతా రాజ్యాంగ పరిరక్షణ కోసం వీధుల్లోకి రావటం విశేషం.ట్రంప్ తన తీరును మార్చుకోవాలన్న ఉద్దేశంలో ఈ ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోకపోతే పాలనను స్తంభింపచేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ నిరసనలు కోర్టులను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం ఆయా దేశాల తీరును తప్పు పట్టిన ట్రంప్.. చివరకు తన సొంత రాజ్యంలో వెల్లువెత్తతున్న ఆందోళనలకు ఎలాంటి భాష్యం చెబుతారో చూడాలి.
