ఆ రెండు నోట్లు రద్దు...పెద్ద నోట్ల సంగతేంటి ?
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టనున్న రూ.10, రూ.20 డినామినేషన్లలో వంద కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ఆర్బీఐ జారీ చేయనుందని తెలుతోంది.
By: Satya P | 28 July 2026 9:12 AM ISTదేశంలో మరోసారి నోట్ల రద్దు కాబోతున్నాయా అని జనంలో కంగారు పెరుగుతోంది. ఎందుకంటే అందరికీ గత చేదు అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి. సరిగ్గా ఇప్పటికి పదేళ్ళ క్రితం 2016 నవంబర్ 8న 500 అలాగే 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. దాంతో శీతాకాలంలో జనం పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు అని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పెద్ద నోట్లు రద్దు కావు కానీ కొత్త నోట్లు మార్కెట్ లోకి రాబోతున్నాయని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న నోట్లు ఎక్కువ మంది చేతులలో ఉంటాయని అందువల్ల వాటిని ఈసారి ప్లాస్టిక్ రూపంలోకి మార్చి జనం చేతులలో ఉంచబోతున్నారు అని అంటున్నారు.
పెద్ద నోట్ల పై స్పష్టత :
అదే సమయంలో వేయి రూపాయలు అయిదు వందల రూపాయలు నోట్లు రద్దు భయాలు సందేహాలు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది. దేశంలో ఎలాంటి కొత్త నోట్ల రద్దు లేదా డీమోనిటైజేషన్ జరగబోదని అధికారికంగా పేర్కొంది. వేయి రూపాయలు రూ.500 లేదా చిన్న నోట్లు రద్దు అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. అయితే రూ.100, రూ.200 వంటి చిన్న డినామినేషన్ నోట్ల లభ్యతను పెంచేందుకు మాత్రమే ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశాలు ఇచ్చింది అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. అయితే పాత కాగితపు నోట్లు రద్దు కావని, కొత్తవి వాటితో పాటు సమాంతరంగా మార్కెట్లో ఉంటాయని కేంద్రం వెల్లడించడం ఊరటను ఇచ్చే విషయంగామే చూస్తున్నారు.
ప్లాస్టిక్ నోట్లు జనంలోకి :
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టనున్న రూ.10, రూ.20 డినామినేషన్లలో వంద కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ఆర్బీఐ జారీ చేయనుందని తెలుతోంది. దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్లాస్క్టిక్ నోట్ల మన్నికతో పాటు పనితీరు ఎలా ఉంది అన్నది పరిశీలించడమే ఈ క్షేత్ర స్థాయి పరీక్షల ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ ఈ నోట్ల మన్నిక సంతృప్తికరంగా ఉంటే కనుక మార్కెట్ లో పూర్తి స్థాయిలో 10 రూపాయలు 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లు దిగుతాయని అంటున్నారు. ఇక జనాల చేతులలో ఎక్కువగా ఉండేవి ఈ చిన్న డినామినేషన్లే కాబట్టి త్వరగా పాడవుతున్నాయని వాటిని తిరిగి ముద్రించడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని భావించే ప్లాస్టిక్ వైపుగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో. ఒక ఈ ప్రయోగం సక్సెస్ అయితే తరువాత కాలంలో అయినా వేయి అయిదు వందల నోట్లు కూడా ప్లాస్టిక్ రూపంలోకి మారే చాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నకిలీ బెడద వీటికి ఉండదు, పైగా బ్లాక్ మనీని అరికట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతోనే అని అంటున్నారు.
