Begin typing your search above and press return to search.

నితీష్ రాజీనామా వెనక బలమైన రీజన్ ?

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేయడం లాంచనం అని తేలిపోయింది.

By:  Satya P   |   5 March 2026 3:16 PM IST
నితీష్ రాజీనామా వెనక బలమైన రీజన్ ?
X

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేయడం లాంచనం అని తేలిపోయింది. ఆయనే స్వయంగా ఎక్స్ ఖాతాలో తాను జాతీయ రాజకీయాలకు వెళ్ళనున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఆయన కోరి వెళ్తున్నారు అని అనుకోవాలి. అయితే ఇది బయటకు కనిపించే విషయంగా ఉన్నా అంతర్గతంగా చాలానే ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే నితీష్ బీహార్ సీఎం గానే ఉండాలని భావించారని అంటున్నారు.

లెక్క అలా ఉంది :

కానీ ఎన్డీయే కూటమి బీహార్ లో అధికారంలో ఉంది. కూటమిలో బీజేపీకి 89 సీట్లు ఉన్నాయి. అంతే కాదు లోక్ జన శక్తి పార్టీ మాంజీ పార్టీ సహా మిత్రులు అంతా బీజేపీకి మద్దతుగా ఉన్నారు. అలా చూస్తే మొత్తం మ్యాజిక్ ఫిగర్ అయిన 123 సీట్లకు బీజేపీ అతి చేరువలోనే ఉంది. ఇపుడు కూడా బీహార్ లో సీఎం గా నితీష్ ఉన్నా కీలక శాఖలు అన్నీ బీజేపీ వద్దనే ఉన్నాయి. బీజేపీ మాటే అన్నింటా చెల్లుబాటు అవుతోంది. ఇక నితీష్ కూడా సుదీర్ఘ కాలం బీహార్ సీఎం గా ఉంటూ రికార్డు క్రియేట్ చేశారు. దాంతో ఆయన కూడా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకోవడం దానికి రాజకీయ అనివార్యత తోడు అయింది అని అంటున్నారు. ఇలా బీజేపీ నుంచి ఉన్న రాజకీయ ఒత్తిళ్ళు ఉండడం ఒక కారణం అయితే రెండవ కారణం కూడా బలంగానే ఉంది అని అంటున్నారు.

కుమారుడి కోసమే :

నితీష్ కుమార్ కి ఏకైక వారసుడు నిశాంత్ కుమార్ ఉన్నారు. ఆయన ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ జేడీయూ క్యాడర్ లీడర్ అంతా గట్టిగా కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలను వదలాల్సి వచ్చింది అని అంటున్నారు. నితీష్ సీఎం పదవి వదులుకుంటే నిశాంత్ కుమార్ కి ఎన్డీయే ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. ఆ విధంగా కుమారుడుకి రాచబాటగా ఉంటుంది. మరో నాలుగున్నర ఏళ్ళ పాటు నిశాంత్ ఈ కీలక పదవిలో ఉంటూ రాటు తేలుతారు అని అంటున్నారు.

కేంద్రంలో పదవి :

ఇక నితీష్ కుమార్ కి కేంద్రంలో కీలక పదవి కూడా దక్కుతుంది. అలా ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు కీలకమైన పదవులు దక్కించుకుంటారు. అంతే కాదు నిశాంత్ రాజకీయ జీవితాన్ని కేంద్ర మంత్రిగా ఉంటూ తీర్చిదిద్దవచ్చు అన్నది కూడా నితీష్ కుమార్ కి ఉంది. ఈ విధంగా అనేక రకాలైన ఆలోచనలతోనే ఆయన సీఎం పదవిని వీడారని అంటున్నారు. నిజానికి చూస్తే నితీష్ ఆషామాషీ నాయకుడు ఏమీ కాదు, ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. రాజకీయ చతురుడిగా పేరుంది. లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాబల్యంతో బలంగా ఉన్న ఆర్జేడీ కోటను కూల్చి మరీ ఎన్డీయే స్థాపన జరిగేలా చేశారు అంటే నితీష్ ఇమేజ్ ని ఊహించుకోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక నితీష్ కొంత అయిష్టంగానే బీహార్ పీఠాన్ని వదులుతున్నారు. అదే సమయంలో దూర దృష్టితోనే వ్యవహరిన్స్తున్నారు అని అంటున్నారు చూడాలి మరి రానున్న కాలంలో బీహార్ మీద నితీష్ పట్టు ఏ విధంగా బిగుస్తుందో లేదా సడలిపోతుందో అన్న సంగతి.