Begin typing your search above and press return to search.

దేశ రాజకీయాల్లో బీహార్ ప్రకంపనలు

బీహార్ ఒక పెద్ద రాష్ట్రం. హిందీ బెల్ట్ లో అతి కీలకమైన రాష్ట్రం. అక్కడ కనుక రాజకీయంగా మార్పు వస్తే అది జాతీయ స్థాయిలోనే బిగ్ సౌండ్ చేస్తుంది.

By:  Satya P   |   10 Nov 2025 9:54 AM IST
దేశ రాజకీయాల్లో బీహార్ ప్రకంపనలు
X

బీహార్ ఒక పెద్ద రాష్ట్రం. హిందీ బెల్ట్ లో అతి కీలకమైన రాష్ట్రం. అక్కడ కనుక రాజకీయంగా మార్పు వస్తే అది జాతీయ స్థాయిలోనే బిగ్ సౌండ్ చేస్తుంది. బీహార్ మీద అందుకే అందరూ ఫుల్ ఫోకస్ పెట్టేశారు. బీహార్ మహా ఘట్ బంధన్ ని గెలిపించడండి. ఈ ఒక్క ఓటుతో జాతీయ స్థాయిలో రాజకీయం కూడా మారుతుంది అని కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బీహార్ కి డైరెక్ట్ గానే కేంద్ర రాజకీయాలతో సంబంధం ఉంది. దాని పేరే జేడీయూ, దాని అధినేత ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

నితీష్ ఓడితే :

బీహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న రానున్నాయి. ఈ ఫలితాలు కనుక మహా ఘట్ బంధన్ కి అనుకూలంగా వస్తే మాత్రం జాతీయ స్థాయిలో అతి పెద్ద సంచలనమే అవుతుంది అని అంటున్నారు. నితీష్ కుమార్ ఓటమి చెంది మాజీ సీఎం అయితే మాత్రం అది ఒక్కలా ఉండదని అంటున్నారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా ఖాళీగా అయితే లేరు. ఆయన కూటములు మార్చి మార్చి సీఎం పదవిలో అలా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఇపుడు ఆయన కనుక ఒక్కసారి మాజీ సీఎం అనిపించుకుంటే అపుడు ఎలా అన్నది ఒక చర్చ.

చెన్నారెడ్డి పోలిక :

నితీష్ కుమార్ కి ఇక్కడ ఉమ్మడి ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డితో ఒక పోలిక కూడా పెడుతున్నారు విశ్లేషకులు. చెన్నారెడ్డిని ఎపుడూ కాంగ్రెస్ ఖాళీగా ఉంచలేదు, ఏదో ఒక పదవిని ఇస్తూ ఆయనను అలా అధికార కేంద్రంగానే చేస్తూ వచ్చింది. ఆయన కనుక ఖాళీగా ఉంటే పన్నే వ్యూహాలు ఏకంగా కొంప ముంచేస్తాయి అన్నది కాంగ్రెస్ ఆనాటి పెద్దల నమ్మకం. అదే నిజం కూడా. ఇపుడు నితీష్ కుమార్ కూడా అలాంటి స్టామినా ఉన్న వారే అని అంటున్నారు. ఆయన ఓటమిని ఓర్వలేరు అని అంటున్నారు. ఆయన మాజీ అయితే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ సైతం సాగుతోంది.

ఎన్డీయే సర్కార్ కి కుదుపు :

కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కి రెండు కీలక పార్టీల మద్దతు అందుతోంది. ఏపీ నుంచి టీడీపీ పదహారు ఎంపీ సీట్లు బీహార్ నుంచి నితీష్ కుమార్ కి చెందిన జేడీయూ ఎంపీలు 12 మంది కొమ్ము కాస్తున్నారు ఇందులో నితీష్ కుమార్ ఇండియా కూటమి వైపు టర్న్ తీసుకుంటారా అన్న చర్చ సైతం సాగుతోంది ప్రస్తుతానికి అది ఎంతో ఊహాజనితమైన ఆలోచన అయినప్పటికీ రాజకీయాల్లో ఏదీ జరగదు అన్నది ఏమీ లేదు దాంతో కనుక చూస్తే బీహార్ లో ఓటమి తరువాత నితీష్ కుమార్ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి అన్నది కమలనాధులు సైతం అంచనా వేస్తున్నారా లేదా అన్నది ఒక డౌట్.

అదే కనుక జరిగితే :

బీహార్ లో ఓటమి తరువాత నితీష్ కుమార్ ను కేంద్రానికి తీసుకుని రావాలి. కేంద్రంలో ఆయనకు కీలక శాఖలు ఇస్తూ ఉప ప్రధానిగా చేయాలన్న డిమాండ్ ఏమైనా పెడతారా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. దానికి బీజేపీ పెద్దలు అంగీకరిస్తారా అన్నది మరో సందేహంగా ఉంది అన్నది సైతం ప్రచారం. అలా కాకుండా నితీష్ ని మాజీ సీఎం గా అలా ఉంచితే అది అటు ఇటూ తిరిగి ఏకంగా ఎన్డీయే సర్కార్ కే ఎసరు తెస్తుందా అన్నది మరో చర్చ. అలా జరగాలనే కాంగ్రెస్ బలంగా కోరుకుంటోంది అని అంటున్నారు ఇండియా కూటమి ఆలోచనలు అలాగే సాగుతున్నాయి. అయితే కేంద్రంలో ప్రభుత్వం మాత్రం తుమ్మితే ఊడే ముక్కు అయితే కాదు, బలమైన ప్రధానిగా మోడీ ఉన్నారు. ఇక నితీష్ కుమార్ ఎన్డీయేలోనే కొనసాగేలా చూస్తారు. అంతే కాదు ప్లాన్ బీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని ఉంటారు అని అంటున్నారు. సో బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వస్తే ఇండియా కూటమికి దెబ్బ పడి అక్కడ ప్రకంపనలు పుడతాయి అని కూడా ఉంది. కాదు అనుకుంటే ఏమి జరుగుతుంది అన్నది కూడా ఉంది. సో వెయిట్ అండ్ సీ.