Begin typing your search above and press return to search.

లాలూ ఫ్యామిలీకి తొలి షాక్ ఇచ్చిన నితీష్

ఐదవసారి బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.

By:  Satya P   |   26 Nov 2025 4:00 PM IST
లాలూ ఫ్యామిలీకి తొలి షాక్ ఇచ్చిన నితీష్
X

ఐదవసారి బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఆయన కొత్తగా సీఎం అయితే కాలేదు. 2005 నుంచి ఆ పీఠం మీద ఉన్నారు. కానీ ఈసారి మాత్రం నితీష్ కుమార్ లోని మరో కోణాన్ని స్వయగా లాలూ ఫ్యామిలీ చూస్తోంది. తాజాగా నితీష్ సర్కార్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం తో లాలూ ఫ్యామిలీ తీవ్ర షాక్ కి గురి అయింది బీహార్ మాజీ సీఎం, శాసనమండలిలో విపక్ష నాయకురాలు అయిన రబ్రీదేవిని అధికార నివాసం ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇష్యూ చేసింది. ఆమెకు ప్రస్తుతం మండలిలో విపక్ష నేత హోదా మాత్రమే ఉంది కాబట్టి ఆ హోదాకు సరిపడా ఒక భవనాన్ని ప్రభుత్వం చూపించింది.

సీఎం గా ఉన్న దగ్గర నుంచి :

లాలూ మొదట సీఎం తరువాత రబ్రీదేవి 2005 దాకా సీఎం అలా ఆ కుటుంబం బీహార్ రాజధాని పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లాలోనే నివాసం ఉంటోంది. ఏకంగా రెండు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. అక్కడే ఆర్జేడీ రాజకీయ కార్యకలాపాలు అదే విధంగా లాలూ మొత్తం సంతానం కూడా కలసి నివసిస్తోంది. ప్రస్తుతం చూస్తే లాలూ రబ్రీదేవి, తేజస్వి యాదవ్ కుటుంబం అక్కడ ఉంటోంది. అయితే ఈ భవనాన్ని ఖాళీ చేయాలంటూ భవన నిర్మాణ శాఖ మాజీ సీఎం రబ్రీదేవికి తాజాగా నోటీసులు జారీ చేయడం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.

అక్కడికి షిఫ్ట్ కావాలని :

ఇదిలా ఉంటే శాసన మండలిలో ప్రతిపక్ష నాయరాలి హోదాకు సరిపడే మరో భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఆ భవనాన్ని రబ్రీదేవికి సెంట్రల్ పూల్ బంగ్లాల కింద హార్డింగ్ రోడ్‌లోని ఇల్లు నంబర్ 39గా కేటాయించింది. దాంతో సువిశాలమైన 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లాని లాలూ ఫ్యామిలీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఆర్జేడీ అంటే అక్కడే అని లాలూ ఫ్యామిలీ కూడా అక్కడే అని దశాబ్దాలుగా ఆ పార్టీ క్యాడర్ నాయకులు అందరికీ తెలుసు. పైగా అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉన్న చోట నుంచి ఉన్నపళంగా ఖాళీ చేయమని కోరడమేంటి అని ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.

గతంలో లేనిది :

అయితే గతంలోనూ ఆమె మాజీ సీఎం గానే ఉన్నారు. నితీష్ సీఎం గా ఉన్నారు. మరి ఆనాడు 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లా విపక్ష నేత హోదా కోసం కాదని ఎందుకు గుర్తించలేకపోయారు అని అంటున్నారు. ఇపుడు మరో చోటుకు వెళ్ళమని చెప్పడం వెనక రాజకీయ ఉద్దేశ్యాలే ఉన్నాయని అంటున్నారు. ఇక ఆర్జేడీ నేతలు అయితే లాలూ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని కానీ ప్రజల హృదయాలలో ఆయన ప్లేస్ ని ఏవరూ ఖాళీ చేయించలేరని అంటున్నారు. కానీ రూల్స్ ప్రకారం చూస్తే అంత పెద్ద బంగ్లా సీఎంలకే కేటాయిస్తారు అని అంటున్నారు. కానీ ఇన్నాళ్ళూ ఊరుకుని ఇపుడే ఇలా చేయడం వెనక నితీష్ కంటే ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ఎక్కువ ఉందని అర్ధం అవుతోందని అంటున్నారు. మొత్తానికి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి షాక్ ఇలా లాలూ ఫ్యామిలీకి తగిలింది. ముందు ముందు ఎన్ని ఉన్నాయో అని అంటున్నారు.