Begin typing your search above and press return to search.

తెలంగాణాలో కమలం ...నితిన్ నబీన్ మంత్రాంగం

తెలంగాణా బీజేపీని బలోపేతం చేయాలన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన దక్షిణాదిన బీజేపీకి ఆశాకిరణంగా తెలంగాణా కనిపిస్తోంది.

By:  Satya P   |   30 Jun 2026 6:00 AM IST
తెలంగాణాలో కమలం ...నితిన్ నబీన్ మంత్రాంగం
X

తెలంగాణా బీజేపీని బలోపేతం చేయాలన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన దక్షిణాదిన బీజేపీకి ఆశాకిరణంగా తెలంగాణా కనిపిస్తోంది. కష్టపడితే అధికారంలోకి రావచ్చు అన్న లెక్కలు ఏవో బీజేపీ పెద్దలకు ఉన్నాయి. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరస పర్యటనలు చేస్తున్నారు. ఆయన నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాక రెండోసారి తెలంగాణాకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలు పెట్టుకున్నారు. ఇక బూత్ లెవెల్ క్యాడర్ తో సమావేశం అయినపుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఫుల్ టైం పొలిటీషియన్స్ గా :

బీజేపీ క్యాడర్ ఫుల్ టైం పొలిటీషియన్స్ అని నితిన్ నబిన్ ఎత్తేశారు. రాహుల్ గాంధీ అయితే కాంగ్రెస్ లో పార్ట్ టైం పొలిటీషియన్ అని ఆయన విమర్శించారు. తెలంగాణాలో బీజేపెకి ఎంతో బలం ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇవ్వడం తప్ప చేసినది లేదని చెప్పారు. అందుకే ఆ పార్టీని గద్దె దించాలని అన్నారు. హైదరాబాద్ కార్పోరేషన్ వరంగల్ కార్పోరేషన్ బీజేపీ గెలుచుకోవాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. 2028 లో జరిగే తెలంగాణా ఎన్నికల్లో విజయం తప్పకుండా సాధించాలని ఆయన క్యాడర్ కి హితబోధ చేశారు.

పట్టు పెరిగిందా :

బీజేపీకి గతం కంటే పట్టు పెరిగిందా లేదా తగ్గిందా అన్నది చర్చగా ఉంది. బీఆర్ఎస్ టైం లో ఒక ఊపు ఊపిన బీజేపీ కాంగ్రెస్ ఏలుబడిలో తన మూడవ స్థానానికే పరిమితం అయింది. ఈ మధ్యలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు కానీ లేదా స్థానిక ఎన్నికలు కానీ బీజేపీ అయితే అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ ని చూపించలేకపోయింది. ఇక పార్టీ నేతల మధ్య ఐక్యత లేదని విమర్శలు ఉన్నాయి. వర్గ పోరు సాగుతోంది అని కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో నితిన్ నబిన్ లీడర్లకు మాత్రం క్లాస్ తీసుకునే వెళ్తారు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో బీజేపీ బలోపేతానికి నాయకులు అయితే పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని బీజేపీ అగ్ర నాయకత్వానికి నివేదికలు కూడా ఉన్నాయి.

నితీష్ దిశా నిర్దేశం :

ఇక జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ పార్టీకి చేసే దిశా నిర్దేశకత్వం పనిచేస్తుందా అన్నది చర్చగా ఉన్నది. స్థానిక ఎన్నికల్లో ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఏమేమి లోటు పాట్లు ఉన్నాయన్నది కూడా జాతీయ అధ్యక్షుడు వివరిస్తారు అని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ని గెలుచుకుని తీరాల్సిందే అన్నది బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశంగా ఉంది. మరి ఆ దిశగా తెలంగాణా పార్టీ నాయకత్వం ముందుకు కదులుతుందా అన్నదే ప్రశ్నగా ఉనిద్. ఇక హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పోరేషన్లలో బలమైన అభ్యర్ధులు ఎవరు ఏమిటి అన్నది కూడా నితిన్ నబిన్ నిశితంగా పరిశీలన చేయనునారు. మరో వైపు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి చూస్తోంది. దీంతో బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవాల్సి ఉంది. ముందు గ్రేటర్ ఎన్నికలు ఆ మీదట అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అన్నది బీజేపీ పెద్దల అజెండాగా ఉంది. దాంతో నితిన్ నబిన్ ఏ రకమైన మంత్రాంగం వేస్తారు అన్నదంతా ఆసక్తిగా చూస్తున్నారు.