Begin typing your search above and press return to search.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడికి ప్ర‌మోష‌న్‌.. ఎందుకింత ఇంపార్టెంట్‌!

దీంతో నితిన్ అటు మంత్రిగా, ఇటు బీజేపీ జాతీయ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌ను పూర్తిస్థాయిలో జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకునేందుకు రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

By:  Garuda Media   |   4 March 2026 9:00 AM IST
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడికి ప్ర‌మోష‌న్‌.. ఎందుకింత ఇంపార్టెంట్‌!
X

ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న నితిన్ న‌బీన్‌కు మ‌రో ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేస్తూ బీజేపీ నిర్ణ‌యించింది. ఆయ‌న బుధ‌వారం లేదా గురువారం నామినేష‌న్ వేయ‌నున్నారు. అయితే.. ఇలా నితిన్‌కు వ‌రుస ప్ర‌మో ష‌న్లు ఇవ్వ‌డం వెనుక ఉద్దేశం ఏంటి? అనేది చ‌ర్చనీయాంశంగా మారింది. వాస్త‌వానికి గ‌త బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం లోనే ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ప్ర‌మోట్ చేయాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. దీనికి కార‌ణం.. బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షాతో నితిన్‌కు ఉన్న అనుబంధ‌మే కార‌ణ‌మ‌ని చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే.. ఆ త‌ర్వాత అనూహ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. నితిన్‌ను కాద‌ని అప్ప‌టి సీఎం నితీష్‌కుమార్‌నే బీహార్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే బీహార్‌లో ఎన్డీయే నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. నితిన్ న‌బీన్‌ను మంత్రిని చేశారు.. బీహార్‌లోని బాంకీపూర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఇది రెండో సారి. ఇక‌, ఆ వెంట‌నే బీజేపీ జాతీయ ప‌గ్గాల కోసం ఎంతో మంది సీనియ‌ర్లు ఎదురు చూస్తున్నా.. వారిని కాద‌ని.. నితిన్‌ను ఎంపిక చేశారు. ఇది కూడా సైలెంట్‌గా జ‌రిగిపోయింది. నిజానికి అప్ప‌టివ‌ర‌కు పురందేశ్వ‌రి, నిర్మ‌లా సీతారామ‌న్ వంటి పెద్ద‌ల పేర్లు ప‌రిగ‌ణ‌న‌లో కి తీసుకుంటున్నార‌న్న ప్ర‌చారం ఉన్నా.. దీనిని కాద‌ని నితిన్‌ను ఏక‌గ్రీవంగా ఎంపిక చేశారు.

దీంతో నితిన్ అటు మంత్రిగా, ఇటు బీజేపీ జాతీయ సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న‌ను పూర్తిస్థాయిలో జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకునేందుకు రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఖాళీ అవుతున్న రాజ్య‌స‌భ స్థానాల్లో బీహార్ నుంచే ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున పెద్ద‌ల స‌భ‌కు పోటీ చేయ‌నున్నారు. ఈ పోటీ కూడా లాంఛ‌న‌మే కానుంది. ఇక్క‌డ మెజారిటీ సీట్లుఎన్డీయేకు ఉండ‌డంతో ఆయ‌న ఎన్నిక న‌ల్లేరుపై న‌డ‌కే కానుందని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇలా.. ప్ర‌మోష‌న్ల‌పై ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌డం వెనుక‌.. నితిన్ న‌బీన్ సామాజిక వ‌ర్గంతోపాటు.. పార్టీకి విధేయుడు అనే మాట వినిపిస్తున్నాయి.

40+లో ఉండ‌డం నితిన్ న‌బీన్‌కు భారీగా క‌లిసి వ‌స్తోంది. యువ‌త‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో.. బీజేపీలో ఉన్న 60+ నాయ‌కుల‌కు చెక్ పెట్టాల‌న్న వ్యూహం కూడా క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే నితిన్‌కు అటు ప్ర‌ధాని, ఇటు హోం మంత్రి కూడా ద‌న్నుగా నిలుస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ అయితే.. ఆయ‌న రాష్ట్రంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో మంత్రి పీఠాన్ని కూడా వ‌దులుకుంటారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి పోస్టును కూడా రెడీ చేస్తున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.