లక్కీ హ్యాండ్...బీజేపీ అధ్యక్షుడి బ్యాక్ గ్రౌండ్
బీజేపీ కొత్త ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఆయన బీహార్ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలను మంత్రిగా చూశారు.
By: Satya P | 20 Jan 2026 8:42 AM ISTభారతీయ జనతా పార్టీని 1980 ఏప్రిల్ 6న అప్పటి నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి లాల్ కృష్ణ అద్వానీ మరి కొందరు సీనియర్లు కలసి స్థాపించారు. ప్రస్తుతం ఆ పార్టీ వయసు 46 ఏళ్ళు. కానీ బీజేపీ ఏజ్ కంటే కూడా తక్కువతో అంటే 45 ఏళ్ళ నితిన్ నబీన్ ఆ పార్టీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారు. ఇది నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. బీజేపీ పుట్టిన ఏడాది తరువాత నబీన్ పుట్టారు అన్న మాట. అంత పెద్ద పార్టీకి ఇంత చిన్న వయసు కలిగిన వారు ఎల సారధి కాగలిగారు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే అన్నీ విశేషాలే ఉన్నాయి.
ఆయన కోసం 37 సెట్లు :
బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం పార్టీలోని అంతా కలసి 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి నితిన్ నబిన్ నామినేషన్ పత్రాల సెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న కె లక్ష్మణ్‌కు అందజేశారు. ఎంతో గొప్పగా సాగిన ఈ నామినేషన్ పర్వంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు తదితరులు అంతా పాల్గొన్నారు. అంతటి పెద్ద పదవి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధి నాయకుడు అంటే ఎంతో గౌరవం. అలాంటి పదవికి నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన కొత్త ప్రెసిడెంట్ అయిపోయారు. ఆయన మంగళవారం ప్రమాణం చేయనున్నారు.
ఎన్నో కీలక బాధ్యతలు :
బీజేపీ కొత్త ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఆయన బీహార్ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలను మంత్రిగా చూశారు. అదే విధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలో పార్టీకి ఇంచార్జిగా వ్యవహరించి పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేశారు. ఒక విధంగా ఆయన లక్కీ హ్యాండ్ అంటారు. ఆయన ఏ రాష్ట్రం వెళ్ళినా పార్టీని గెలిపించుకుని వచ్చేవారు.
తండ్రి నుంచే రాజకీయం :
ఇక నితిన్ నబీన్ తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు ఆయన తండ్రి నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ సీనియర్ నాయకుడు. ఆయన పాట్లా పశ్చిమ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. నితిన్ రాజకీయ జీవితం వయసు అక్షరాలా రెండు దశాబ్దాలు అంటే 2006లో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు అన్న మాట. తండ్రి సొంత నియోజకవర్గం అయిన పాట్నా వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలుత గెలిచిన నితిన్ నబీన్ ఆ విధంగా ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీ ప్రవేశం చేశారు. ఇక అసెంబ్లీ సీట్ల పునర్విభజన అనంతరం ఆయన బాంకిపూర్‌కు మారారు. అప్పటి నుంచి 2010, 2015, 2020, 2025 ఇలా మరో నాలుగు సార్లు నెగ్గారు. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు సాధించారు.
నితీష్ సర్కార్ లో నితిన్ :
బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో నితీష్ అనేక మంత్రి పదవులు చేపట్టారు. ఆయన రహదారులు నిర్మాణ మంత్రిత్వ శాఖ అలాగే పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం న్యాయ మంత్రిత్వ శాఖ వంటివి నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. యువ నేతగా బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా ఉన్న నితిన్ నబీన్ బీజేపీ అప్పగించిన బాధ్యతల మేరకు సిక్కిం ఇంచార్జిగా వ్యహరించారు. ఆ రాష్ట్రంలో కమల వికాసానికి కారణం అయ్యారు, అలాగే, ఛత్తీస్‌గఢ్ కో ఇంచార్జిగా పని చేసి అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చేశారు. బీహార్ ఎన్నికల్లోనూ చురుకుగా వ్యవహరించి బీజేపీ అఖండ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
ముఖ్యమంత్రి కావాల్సింది :
ఇక బీజేపీ తరఫున బీహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీని నబీన్ పేరు గట్టిగా వినిపించింది. అయితే నితీష్ కుమార్ కే మరో సారి చాన్స్ ఇవ్వడంతో ఆయనకు అవకాశం రాలేదు, కానీ ఇపుడు జాతీయ స్థాయిలోనే ఆయన ఒక వెలుగు వెలగనున్నారు. సో యువ నేతగా ఉంటూ బీజెపేఎ సారధి కావడం నితిన్ నబీన్ సాధించిన రికార్డుగానే చూడాలని అంటున్నారు.
