Begin typing your search above and press return to search.

వీడియో: లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న కోసం నీతా అంబానీ భ‌ర‌త‌నాట్యం ప్రాక్టీస్

భారతీయ శాస్త్రీయ నృత్యంపై తనకున్న అభిరుచిని నీతా అంబానీ మరోసారి చాటుకున్నారు. ముంబైలోని ఎన్‌ఎంఏసీసీలో జరగనున్న ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’ కార్యక్రమం కోసం ఆమె భరతనాట్యం రిహార్సల్స్ చేస్తున్న వీడియోను స్వదేశ్ ఆన్‌లైన్ నవంబర్ 21న విడుదల చేసింది. సంప్రదాయ దుస్తుల్లో నీతా అంబానీ కనిపించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

By:  Sivaji Kontham   |   22 Nov 2026 5:50 AM IST
వీడియో: లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న కోసం నీతా అంబానీ భ‌ర‌త‌నాట్యం ప్రాక్టీస్
X

భారతీయ శాస్త్రీయ నృత్యంపై తనకున్న నిరంతర అభిరుచిని నీతా అంబానీ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్.ఎం.ఏ.సీ.సీ) వేదికపై ప్రతిష్టాత్మకంగా జరగనున్న `ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్` కార్యక్రమం కోసం నీతాజీ భరతనాట్యం రిహార్సల్స్ చేస్తున్న ప్రత్యేక వీడియోను `స్వదేశ్ ఆన్‌లైన్` నవంబర్ 21న విడుదల చేసింది. చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందిన నీతా అంబానీ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి నివాళిగా ఈ వేదికపై తన నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఈ రిహార్సల్ వీడియోలో నీతా అంబానీ ధరించిన రోజ్-పింక్ లెహంగా భారతీయ సంప్రదాయ హుందాతనానికి అద్దం పట్టింది. అతిగా ఆర్భాటం లేకుండా సున్నితమైన బంగారు వర్ణపు బుటీలు.. ఎరుపు-బంగారు జరీ బోర్డర్ ఉన్న లెహంగా స్కర్ట్‌ను ధరించారు. చీర కొంగు తరహాలో అమర్చుకున్న పట్టీ దుపట్టా.. దానికి తగ్గట్టుగా ఎరుపు-బంగారు అంచులతో కూడిన హాఫ్-స్లీవ్ బ్లౌజ్ త‌న‌ నృత్య కదలికలకు మరింత అందాన్ని తెచ్చాయి.

సంప్రదాయ వస్త్రధారణకు తగ్గట్టుగా నీతా అంబానీ ఎంచుకున్న ఆభరణాలు..అలంకరణ క్లాసిక్ ఇండియన్ గ్లామర్‌ను గుర్తు చేశాయి. చెవులకు పెద్ద బంగారు జుంకాలు, చేతులకు గులాబీ-ముత్యాల-బంగారు గాజులు, వేలికి పూల ఆకృతిలో ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించారు. కళ్లకు కాటుక.. నుదుటిన మెరూన్ బొట్టుతో .. సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు.

ఒకవైపు వ్యాపార, సేవా కార్యక్రమాలలో నిత్యం బిజీగా ఉంటూనే... భారతీయ కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. భారత నాగరికత, చరిత్ర, కళా సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ మ్యూజికల్ ప్రదర్శనలో నీతాజీ స్వయంగా నృత్యం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నీతా అంబానీకి శాస్త్రీయ నృత్యం కేవలం ఒక రెగ్యుల‌ర్ అల‌వాటు మాత్రమే కాదని.. అది త‌న‌ జీవితంలో విడదీయరాని ఒక అభిరుచి అని ఈ రిహార్సల్ వీడియో మరోసారి నిరూపించింది.