Begin typing your search above and press return to search.

బీహార్ సీఎం సామ్రాట్ ... నితీష్ కి డబుల్ ప్రమోషన్

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ కి వచ్చే నెల దాకా కేంద్ర మంత్రి పదవి దక్కే సూచనలు లేవు. కేంద్రంలో మోడీ సర్కార్ విస్తరణ చేపడితే నితీష్ కి చాన్స్ పక్కాగా దక్కుతుంది.

By:  Satya P   |   10 April 2026 7:00 AM IST
బీహార్ సీఎం సామ్రాట్ ... నితీష్ కి డబుల్ ప్రమోషన్
X

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ శకం రాష్ట్రంలో ముగియబోతోంది. రెండు దశాబ్దాలకు పైగా ఆయన సాగించిన ముఖ్యమంత్రిత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఆయన రానున్న ఇరవై నాలుగు గంటలలోనే ఎపుడైనా రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నితీష్ కుమార్ రాజీనామా తరువాత రాజ్యసభ మెంబర్ గా ప్రమాణం చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మోడీ కేబినెట్ లో నితీష్ కుమార్ చేరుతారు. ఆయనకు అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలనే బీజేపీ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.

వారసుడు ఘనమైన ఎంట్రీ :

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ కి ఏకైక సంతానం కుమారుడు నిశాంత్ కుమార్. ఐఐటీ చదివి మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. యాభై ఏళ్ళ నిశాంత్ కుమార్ రాజకీయాల పట్ల మొదటి నుంచి విముఖంగా ఉన్నారు. అయితే చిత్రంగా నిశాంత్ కుమార్ గత కొంతకాలంగా జేడీయూ పాలిటిక్స్ లో కీలక ప్రాత్ర పోషిస్తున్నారు. ఆయనకు అతి కొద్ది రోజులలోనే బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాదు తన తండ్రి ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటు నుంచి ఆయన పోటీ చేసి గెలిచి చట్ట సభలలో అడుగుపెట్టనున్నారు. దాంతో నితీష్ కుమార్ కంటే ముందే నిశాంత్ కుమార్ కి పదవీ యోగం పట్టనుంది అని అంటున్నారు.

రైల్వే కానీ వ్యవసాయం కానీ :

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ కి వచ్చే నెల దాకా కేంద్ర మంత్రి పదవి దక్కే సూచనలు లేవు. కేంద్రంలో మోడీ సర్కార్ విస్తరణ చేపడితే నితీష్ కి చాన్స్ పక్కాగా దక్కుతుంది. ఆయనకు కీలకమైన రైల్వే శాఖను ఇస్తారు అని అంటున్నారు ప్రస్తుతం ఆ శాఖను చూస్తున్న అశ్వినీ వైష్ణవ్ చేతిలో ఐటీ ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసార శాఖలు వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దాంతో నితీష్ కి రైల్వే మంత్రిగా చాన్స్ రావచ్చు. గతంలో ఆయన ఇదే శాఖలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఇష్టమైన శాఖ కూడా ఇది. ఒకవేళ ఇది కాదు అనుకుంటే వ్యవసాయ శాఖ కూడా ఆయన కోసం రెడీ చేసి పెట్టారని అంటున్నారు. ఈ శాఖను ప్రస్తుతం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి నితీష్ కుమార్ కి ఈ శాఖను మళ్ళించవచ్చు అని అంటున్నారు. దేశంలో రైతులకు సేవ చేసే ఈ శాఖ పట్ల కూడా నితీష్ ఎంతో ఇష్టంగా ఉన్నారని అంటున్నారు.

కొత్త సీఎం ఆయనే :

ఇక బీహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి అవుతారు అని అంటున్నారు. ఆయన బీహార్ రాజకీయాల్లో మంచి అనుభవం సంపాదించారు. అంతే కాదు గత అయిదేళ్ల నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అదే పదవిలో ఉన్నారు. బీహార్ రాజకీయాల పట్ల పూర్తి పట్టు ఉన్న వారు, బీజేపీ పెద్దలకే కాదు నితీష్ కుమార్ కి కూడా ఇష్టుడైన వారు. తన వారసుడి ఎంపికలో నితీష్ కుమార్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్న తరుణంలో సామ్రాట్ చౌదరి వైపే నితీష్ కుమార్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. దాంతో ఈ నెల 15న నితీష్ కుమార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. దాంతో బీహార్ లో తొలిసారిగా బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అంటున్నారు.