Begin typing your search above and press return to search.

కేంద్ర బ‌డ్జెట్‌పై ప్ర‌ధాని మోడీ అనాలిసిస్‌ ఇదే!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. తాజాగా ఆదివారం ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

By:  Garuda Media   |   1 Feb 2026 11:57 PM IST
కేంద్ర బ‌డ్జెట్‌పై ప్ర‌ధాని మోడీ అనాలిసిస్‌ ఇదే!
X

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. తాజాగా ఆదివారం ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పారిశ్రామిక వేత్త‌ల‌కు, ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌కు మేలు చేసేదిగా ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌న‌దైన విశ్లేష‌ణ చేశారు. ఈ బ‌డ్జెట్‌ను ఆయ‌న `సంస్క‌ర‌ణ బ‌డ్జెట్‌`గా అభివ‌ర్ణిం చారు. దేశంలో చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌కు ఇది ప్ర‌తిబింబ‌మ‌ని పేర్కొన్నారు.

మూల‌ధ‌న వ్య‌యానికి పెద్ద పీట వేశార‌ని పేర్కొన్నారు. అంటే.. ఆదాయం వ‌చ్చే ప్రాజెక్టుల‌కు అధిక కేటాయింపులు చేశార‌ని మోడీ చెప్ప‌క‌నే చెప్పారు. ఇక‌, వృద్ది విష‌యంలోనూ స‌మ‌తూకం పాటించార‌ని తెలిపారు. తద్వారా ప్ర‌జ‌ల ఆదాయం పెరుగు తుంద‌న్నారు. తాజా బ‌డ్జెట్‌ను ప్ర‌ధాని మోడీ.. చ‌రిత్రాత్మ‌క బ‌డ్జెట్‌గా పేర్కొన్నారు. `ఆత్మనిర్భర్‌ భారత్‌`కు కేటాయింపులు భారీ గా జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఎం.ఎస్‌.ఎం.ఈల‌కు ఎక్కువ‌గా అవ‌కాశం ఇచ్చారు.

సెమీ కండక్ట‌ర్ రంగాన్ని బ‌లోపేతం చేయ‌నున్నారు. వైద్య విద్య‌, విధానంలో పీపీపీకి అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, 2047 మిషన్‌ లక్ష్యాల అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంద‌న్న ప్ర‌ధాని.. నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యాన్ని పేర్కొన్నారు. అంతేకాదు.. మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించేందుకు తాజా బ‌డ్జెట్ ఊత‌మిస్తుంద‌ని ప్ర‌ధాని విశ్లేషించా రు. ``దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు. త్వ‌ర‌లోనే అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నారు. వారికి ఈ బ‌డ్జెట్ స్వాంత‌న ఇస్తుంది`` అని మోడీ ఉద్ఘాటించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు గుప్పించారు. వ‌రుస‌గా తొమ్మిదో సారి కూడా ఆమె బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టి చ‌రిత్ర సృష్టించార‌ని.. ఇది మ‌హిళా సాధికార‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. కాగా.. ఈ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వీక్షించేందుకు.. 30 మంది ఎంపిక చేసిన విద్యార్థుల‌ను పార్ల‌మెంటుకు ఆహ్వానించారు. వారికి గ్యాల‌రీలో సీట్లు కేటాయించారు. కాగా.. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి ఆదివారి యూనియ‌న్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. త‌ద్వారా.. ప్ర‌జా సేవ‌కు సెల‌వులతో సంబంధం ఉండ‌ద‌న్న సంకేతాన్ని ప్ర‌ధాని మోడీ పంపించిన‌ట్టు అయింద‌ని.. బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.