Begin typing your search above and press return to search.

చర్చనీయాంశంగా ఏపీ మంత్రి కుమార్తె నిశ్చితార్థం.. స్పెషల్ ఇదే!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్-కన్వెన్షన్ సెంటర్‌ లో మంత్రి నిమ్మల రామానాయుడి కుమార్తె శ్రీజ నిశ్చితార్థ వేడుక ఆదివారం జరిగింది.

By:  Raja Ch   |   18 Aug 2025 3:55 PM IST
చర్చనీయాంశంగా ఏపీ మంత్రి కుమార్తె నిశ్చితార్థం.. స్పెషల్  ఇదే!
X

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్-కన్వెన్షన్ సెంటర్‌ లో మంత్రి నిమ్మల రామానాయుడి కుమార్తె శ్రీజ నిశ్చితార్థ వేడుక ఆదివారం జరిగింది. ఈ వేడుకకు మంత్రి లోకేష్ తోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాజరయ్యారు. కాబోయే వధూవరులు శ్రీజ, పవన్‌ ను అక్షతలు వేసి ఆశీర్వదించారు.

వీరితో పాటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, శాసనమండలి ఛైర్మన్‌ మోషెన్ రాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఆ సంగతి అలా ఉంటే ఈ రోజుల్లో వివాహ కార్యక్రమాల విషయంలో చాలా మంది అనుసరించే ఆర్భాటాల వైఖరికి భిన్నంగా జరిగిన ఈ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.

అవును... ఈ రోజుల్లో ఓ మోస్తరు వ్యక్తుల ఇళ్లల్లోని వివాహ కార్యక్రమాలు ఎంతో భారీ ఎత్తున జరుగుతున్న ఘటనలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, దుమ్ము లేపేస్తున్నారు. అలాంటిది రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అలాంటి సీనియర్ నాయకుడి ఇంట్లో కార్యక్రమం అత్యంత సింపుల్ గా జరిగింది!

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... తన కుమార్తె నిశ్చితార్ధ వేడుకలో మంత్రి రామానాయుడు ధరించిన దుస్తులు. సాధారణంగా ఇంట్లో జరిగే ఇలాంటి వేడుకల్లో కాస్త బరువైన, ఘనమైన దుస్తులనే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తారనే సంగతి తెలిసిందే. కానీ రామానాయుడు మాత్రం తన ట్రేడ్‌ మార్క్ పసుపు చొక్కా ధరించి కనిపించారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్ కు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోనూ పసుపు చొక్కా ధరించిన రామానాయుడిని, నారా లోకేష్ ఆటపట్టించారని తెలుస్తోంది.