Begin typing your search above and press return to search.

శరీరాన్ని తినే కొత్త జీవి.. అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!

అయితే ఈ వ్యాధి మనుషుల కంటే ఎక్కువగా పశువుల్లోనో వ్యాపిస్తుందని, కానీ మొట్టమొదటిసారి ఒక మనిషి శరీరంలో బయటపడిందని డాక్టర్లు తెలిపారు.

By:  Madhu Reddy   |   27 Aug 2025 6:00 PM IST
శరీరాన్ని తినే కొత్త జీవి.. అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!
X

తాజాగా అమెరికాను ఒక వ్యాధి వణికిస్తోంది. ఇన్ని రోజులు కరోనా వల్ల ప్రపంచం మొత్తం వణికింది. కానీ ప్రస్తుతం అమెరికాలో బయటపడ్డ ఈ కొత్త వ్యాధిని చూసి అమెరికన్స్ అందరూ వణికిపోతున్నారు. ఈ వ్యాధి ఏకంగా మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకువస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల మనుషుల ప్రాణాలకు కొంత వరకు ముప్పు ఉందని చెబుతున్నారు. మరి ఇంతకీ అమెరికాలో బయటపడ్డ ఆ కొత్త వ్యాధి ఏంటి..? దాని లక్షణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రరాజ్యం అమెరికాను న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ మైయాసిస్ అనే కొత్త వ్యాధి వణికిస్తోంది.ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషికి ఎక్కడైతే గాయాలు,పుండ్లు ఉంటాయో వాటి ద్వారా శరీరం లోపలికి చొచ్చుకుపోయి లోపల ఉన్న మాంసం మొత్తాన్ని తినేస్తోంది. ఎప్పుడైతే లార్వా మనిషి శరీరం లోపలికి వెళ్తుందో అప్పటినుండి తీవ్రమైన నొప్పి కలిగి చివరికి ప్రాణాలు పోయే వరకు వస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు. స్క్రూవర్మ్ అనే పరాన్నజీవి తొలిసారిగా అమెరికాలోని ఒక రోగి శరీరంలో కనుగొన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఆగస్టు 25న మొట్టమొదటిసారి దీన్ని బయటపెట్టింది. సాల్వడార్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక రోగి శరీరంలో న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ మైయాసిస్ డాక్టర్లు కనుగొన్నారు..

అయితే ఈ వ్యాధి మనుషుల కంటే ఎక్కువగా పశువుల్లోనో వ్యాపిస్తుందని, కానీ మొట్టమొదటిసారి ఒక మనిషి శరీరంలో బయటపడిందని డాక్టర్లు తెలిపారు.. ఈ వ్యాధి ఈగల ద్వారా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని తెలిపారు. సజీవంగా ఉండే కణజాలాన్ని తినే ఈ పరాన్న జీవి సాధారణంగా కరేబియన్, దక్షిణ అమెరికా ప్రాంతాలలో కనిపిస్తుందని తెలియజేశారు.. ఈగల ద్వారా వ్యాపించే ఈ NWS మైయాసిస్ మొదటిసారి మనుషుల్లో బయటపడిందని తెలిపారు. అయితే అమెరికాలో ఇది వ్యాపించకుండా పూర్తి చర్యలు తీసుకున్నప్పటికీ మెక్సికో,అమెరికా దేశంలోని కొన్నిచోట్ల ఈ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని డాక్టర్లు తెలియజేశారు. ఈ వ్యాధులు ఎక్కువగా శరీరంలో ఎవరికైతే గాయాలు ఉంటాయో ఆ గాయాల మీద ఈగలు వాలినప్పుడు అందులో ఉండే కొన్ని ఈగల లార్వాలు ఆ గాయం నుండి మనిషి శరీరంలోకి చొచ్చుకుపోయి లోపలి మాంసాన్ని మొత్తం తిని ప్రాణాపాయస్థితికి తీసుకువస్తాయట..

ఇలాంటి వ్యాధులు ఎక్కువగా పశువులు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈగలు ఎక్కువగా తిరిగే పరిసరాల్లో ఉంటాయని, ఇలాంటి పరిసరాల్లో నివసించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.ఈ వ్యాధి నుండి బయట పడాలంటే పరిశుభ్రత పాటించడంతోపాటు ఈగలు ఉన్న పరిసరాల్లోకి ఎక్కువగా వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరం మీద ఏదైనా గాయాలు అయితే వెంటనే డాక్టర్లను సంప్రదించి ఆ గాయం మానిపోయేలాగా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.అయితే ఈ వ్యాధి పశువుల పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని మనుషులకు దీనివల్ల ఎక్కువ ముప్పు ఏమీ లేదని అమెరికన్ డాక్టర్లు తేల్చేశారు. ఎందుకంటే రీసెంట్ గా మేరీల్యాండ్ లో తొలిసారి గా ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇక ఆ వ్యక్తికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఈ వ్యాధి వల్ల మనుషులకు ఎక్కువగా ముప్పు లేదని.. కానీ చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రోజుకొక కొత్త వ్యాధి బయటపడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.