Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది కవిత కొత్త పార్టీ

తెలంగాణా రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ రాబోతోంది. ఆ విషయం మీద ప్రచారం కూడా అలాగే ఉంది.

By:  Satya P   |   14 Nov 2025 9:02 AM IST
కొత్త ఏడాది కవిత కొత్త పార్టీ
X

తెలంగాణా రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ రాబోతోంది. ఆ విషయం మీద ప్రచారం కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణా రాజకీయాల్లో శూన్యత ఉందని ఆమె గట్టిగా భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. ఈ మూడే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగా ఉన్న చోట జాతీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి.

ఏపీ తమిళనాడులో :

దక్షిణాదిన చూసుకుంటే ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండు కాదు మూడు ఉన్నాయి. దాంతో అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఏమీ పెద్దగా లేకుండా పోతోంది. తమిళనాడులో అయితే కొన్ని దశాబ్దాలుగా డీఎంకే అన్నా డీఎంకే ల మధ్యనే పోరు సాగుతూ వస్తోంది. ఇపుడు సినీ నటుడు విజయ్ పార్టీ కొత్తగా పెడుతున్నారు. దాంతో అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. దాంతో జాతీయ పార్టీలు అక్కడా పెద్దగా సీన్ లో లేవు.

స్పేస్ ఉందా :

ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ రెండు సార్లు ఓడి అధికారంలోకి వచ్చింది. బీజేపీ అయితే ఇంకా చాలా చోట్ల బలంగా పుంజుకోలేదు. దాంతో బీఆర్ఎస్ ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది. మరో ప్రాంతీయ పార్టీ గట్టిగా వచ్చి నిలబడితే దాని వల్ల బీఆర్ఎస్ కంటే కూడా జాతీయ పార్టీలకే ఇబ్బంది అని అంటున్నారు. కవిత సైతం ఈ విధమైన ఆలోచనలతోనే కొత్త ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షలు రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటున్నారు.

కొత్త పార్టీ ఖాయం :

ఈ క్రమలోనే కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. కొత్త ఏడాదిలోనే పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. జనవరి నెల వెళ్ళాక ఆమె కొత్త పార్టీ మీద కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. ఆమె ప్రజా సంఘాలు తెలంగాణా అస్థిత్వ సంస్థలు మేధావులు వివిధ వర్గాల ప్రజానీకం తో సమావేశం అయిన సందర్భంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వచ్చే స్పందన ఏమిటి ఎలా ఉంటుంది అన్న దాని మీద సానుకూలంగా స్పందన వచ్చిందని అంటున్నారు.

పేరు అదేనా :

ఇక కవిత కొత్త పార్టీ పెడితే పేరు ఏమిటి అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఆమె తెలంగాణా జాగృతి సంస్థని నడుపుతున్నారు. ఆ విధంగా ఆమె బాగా పాపులర్ అయ్యారు. దాంతో ఆమె పార్టీ పేరు కూడా దాదాపుగా జాగృతి పేరు కలిసేలా ఉండొచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కొత్త్త పార్టీ పేరు మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసే పనులలో ఉన్నారని అంటున్నారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద అవసరమైన వివరాలు సమర్పించి తెలంగాణా ప్రజలకు అందరికీ నచ్చెలా తెలిసేలా క్యాచీగా ఉండే పేరు తెలంగాణా అస్తిత్వం ఉండే పేరునే ఎంచుకుంటారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే కవిత తన పార్టీని 2028 ఎన్నికల్లో బరిలో దించాలని చూస్తున్నారు. నేరుగా అసెంబ్లీ ఎన్నికలకే సమాయత్తం చేయాలని అనుకుంటున్నారు. ఈ మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని కూడా భావిస్తున్నారని అప్పటిదాకా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి పటిష్టంగా మార్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.