Begin typing your search above and press return to search.

రంగంలోకి మూడు కొత్త పార్టీలు

ఏపీలో కొత్తగా మూడు పార్టీలు రాబోతున్నాయని అంటున్నారు. ఈ పార్టీలు 2029 ఎన్నికల్లో తమ లక్ ని పరీక్షించుకోబోతున్నాయి.

By:  Satya P   |   2 Feb 2026 9:00 AM IST
రంగంలోకి  మూడు కొత్త పార్టీలు
X

ఏపీలో కొత్తగా మూడు పార్టీలు రాబోతున్నాయని అంటున్నారు. ఈ పార్టీలు 2029 ఎన్నికల్లో తమ లక్ ని పరీక్షించుకోబోతున్నాయి. ఏపీలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటే విపక్షంలో వైసీపీ ఉంది. ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టులు, లోక్ సత్తా, ఆం ఆద్మీ, జై భీం, జేడీ లక్ష్మీనారయణ జై భారత్ పార్టీలు ఉన్నాయి. ఇపుడు మరో మూడు పార్టీలు పురుడు పోసుకుంటున్నాయని టాక్ నడుస్తోంది.

ఏబీవీ నాయకత్వంలో :

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఇప్పటికే వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని అలాగే భావ సారూప్యం కలిగిన వారితో ఆయన డిస్కషన్స్ పెడుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కొత్త పార్టీని రంగంలో ఉంచాలని వీలైనంత మేరకు ప్రభావం చూపించాలని భావిస్తున్నారు.

విజయసాయిరెడ్డి సైతం :

ఇక మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీ దిశగా ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన వైసీపీకి చెందిన ఒకనాటి తన మిత్రులను కదిపి చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే సీఎమలో బలమైన సామాజిక వర్గం నుంచి పెద్దలను కొందరిని ఆకట్టుకుని పార్టీని పెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఆయన వైసీపీలో నంబర్ టూగా వ్యవహరించారు. దాంతో ఏపీ మొత్తం రాజకీయం ఆయనకు తెలుసు. అందువల్ల తన పార్టీని జనంలో ఉంచే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు అని అంటున్నారు.

రాయలసీమ కేంద్రంగా :

ఇంకో వైపు రాయలసీమ కేంద్రంగా కొత్త పార్టీ రానుందని అంటున్నారు. ఈ పార్టీ గ్రేటర్ రాయలసీమ అంటే ఉమ్మడి ఆరు జిల్లాలలనే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు కాబోతోంది అని అంటున్నారు. ఈ పార్టీ లక్ష్హ్యం సీమలో తమ బలాన్ని పెంచుకోవడం అలాగే రెండు ప్రధాన పార్టీల మీద ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడంగా ఉంది అని అంటున్నారు. ఈ కొత్త పార్టీనీ కనుక పెడితే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

డజన్ పార్టీలు సీన్ లో :

ఏతా వాతా తేలేది ఏంటి అంటే 2029 నాటికి డజన్ పార్టీలు రంగంలోకి దిగుతాయని అంటున్నారు. ఈ పార్టీల నాయకత్వాలు తమ ఇమేజ్ నే ఫణంగా పెట్టి పార్టీని నడపాలని చూస్తున్నారు. తమకు సొంత సామాజిక వర్గంలో బలం ఉందని ఆ సామాజిక వర్గాలలో ఉన్న అసంతృప్తి తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా తాము ఎంతో కొంత ప్రభావం చూపిస్తే రేపటి రోజున తమకు రాష్ట్ర రాజకీయాల్లో తగిన గుర్తింపు ఉంటుందని భావించే ఈ రకమైన సాహసానికి దిగుతున్నారు అని అంటున్నారు.

డివైడ్ అయిన పాలిటిక్స్ :

అయితే ఏపీ రాజకీయం పూర్తిగా డివైడ్ అయిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా విభజన జరిగిపోయింది అని విశ్లేషిస్తున్న వారూ ఉన్నారు. గెలిచే పార్టీలకు ఓట్లేసే తీరు కూడా కొత్త పార్టీల ఉనికికి ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు. గతంలో అయితే ఇండిపెండెంట్లు కూడా గెలిచేవారు, కానీ ఇపుడు అలాంటి వాతావరణం లేదు, ఏపీ అసెంబ్లీలో ఇండిపెండెంట్లు చూసి చాలా కాలం అయింది. అలాగే ఎంతో చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ కే డిపాజిట్లు రాకుండా చేస్తున్న రాజకీయం సాగుతోంది. ఏది ఏమైనా కొత్త పార్టీల పుట్టుక అంటే అది ఏపీలో రాజకీయ చైతన్యానికి ప్రతీకగా భావించాలని కూడా అంటున్నారు.