Begin typing your search above and press return to search.

కొత్తరకం క్రైమ్.. చూస్కోండి..

కాలం మారుతున్న కొద్దీ.. ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలంటే మనిషి బయటకు అడుగుపెట్టడానికి కూడా ఒకరకంగా ఆసక్తి కనబరచడం లేదు..

By:  Madhu Reddy   |   17 Jan 2026 8:00 PM IST
కొత్తరకం క్రైమ్.. చూస్కోండి..
X

కాలం మారుతున్న కొద్దీ.. ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలంటే మనిషి బయటకు అడుగుపెట్టడానికి కూడా ఒకరకంగా ఆసక్తి కనబరచడం లేదు..దీనికి తోడు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో మనకు ఏ వస్తువు కావాలన్నా సరే క్షణాల్లో ఇంటిముందు వాలిపోతోంది. కేవలం చేతిలో డబ్బు.. ఆర్డర్ పెట్టుకోవడానికి మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఏ వస్తువైనా సరే ఇంటి తలుపు తడుతోంది అని చెప్పవచ్చు. ఇకపోతే చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ సులభంగా ఆన్లైన్లో దొరకడమే కాకుండా నచ్చిన వస్తువుని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండడం.. పైగా ఆఫర్ పేరిట ధరలు కూడా తక్కువగా ఉండడంతో చాలామంది ఈ ఈ - కామర్స్ వెబ్ సైట్ లలో తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకుంటున్నారు.

అలా ఈ - కామర్స్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరైతే ఆన్లైన్ లో ఎక్కువగా వస్తువులను ఈ - కామర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారో వారినే టార్గెట్ గా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త రకం క్రైమ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. కాస్త ఆదమరిచామో నిలువునా దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ యాంకర్, నటి తాను ఆన్లైన్లో ఎటువంటి ఆర్డర్ పెట్టకపోయినా.. తన పేరు మీదే ఆర్డర్ వచ్చిందని చెప్పి డెలివరీ బాయ్ డబ్బులు ఇప్పించుకొని వెళ్లిపోయారు. తీరా చూస్తే అది ఒక పాతబడిన చీర. తనకు సొంతంగా బొటిక్ ఉందని, తనకు ఇలాంటివి ఆర్డర్ చేసుకునే అవసరం లేదని, సాధారణంగా తాను ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటానని.. అలా పెట్టి ఉంటానేమో అని అనుకొని ఆ ఆర్డర్ను తీసుకున్నానని.. తీరా చూస్తే మోసపోయానని తెలిసింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇక పలుచోట్ల మోసపోయిన బాధితులు కూడా మాకు కూడా ఇలా జరిగింది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త రకం క్రైమ్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఈ - కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్ , అమెజాన్, మిత్రా, మీషో వంటి ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఎవరైతే ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారో వారే ఈ నేరస్తుల టార్గెట్. ముఖ్యంగా మనం వస్తువు కొనుగోలు చేయకపోయినా.. మన పేరు మీద ఇంటికి డెలివరీ వస్తుంది. అందులో ఏదైనా ఒక తక్కువ ఐటెం పెట్టేస్తారు. ఆ డెలివరీ బాక్స్ మనం ఓపెన్ చేయకుండానే పేమెంట్ చేసేస్తాము. తిరిగి ఆ బాక్స్ మనం ఓపెన్ చేసేలోపు ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకేముంది మోసపోయామని తెలుస్తుంది. తిరిగి దాని రిటర్న్ పెడదాం అనుకుంటే అక్కడ రిటర్న్ ఆప్షన్ పక్కన పెడితే అసలు మనం ఆర్డర్ పెట్టి ఉండము. యాక్సిడెంటల్లీ మనం పెట్టి ఉంటాము అని అనుకోవడంతో మనం పెట్టకపోయినా మన ఇంటికి వస్తే మనం డబ్బులు కట్టి మరీ ఆ వస్తువును తీసుకొని చివరికి మోసపోతూ ఉంటాము ఈ క్రమంలోనే సదరు నటి కూడా మోసపోయానని చెప్పుకొచ్చింది.

ఇక ఇలాంటి మోసాలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ ద్వారా వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటున్నారో క్యాష్ ఆన్ డెలివరీ కంటే కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకొని మీకు నమ్మకంగా ఉంటేనే కొనుగోలు చేయడం బెటర్.