Begin typing your search above and press return to search.

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

క్యాష్ స్లాట్ లో ట్రాప్ పెట్టి డబ్బులు రాకుండా చేస్తున్న సైబర్ మోసగాళ్ల తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   4 Nov 2026 11:39 AM IST
కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త
X

అంతా మోసమే.. దేనికి గ్యారెంటీ లేని బతుకులు అవుతున్నాయి.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు బయట పరిస్థితి ఉంది. ఈజీ మనీకి జనాలు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు కష్టపడడం కంటే ఎలా సింపుల్ గా డబ్బు సంపాదించవచ్చా? అని ఆలోచిస్తున్నారు. అందుకే సులువైన మార్గాలు.. వీలుంటే స్కాంలకు పాల్పడుతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, స్మార్ట్ థింకింగ్ జనాలకు ఎక్కువైపోయింది. పక్కోడి మనీని ఎలా కొట్టేయాలని.. ఎలా దొరకుండా తప్పించుకోవాలన్న దానిపై ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. ఆ చావు తెలివి తేటలన్నింటిని ఇప్పుడు అమలు చేస్తూ చాలా మంది కేటుగాళ్లు ఈజీ మనీ సంపాదిస్తున్నారు..

తాజాగా ఓ ఏటీఎంలో డబ్బులు ఎలా కొట్టేయాలో లైవ్ లో కేటుగాళ్లు చేసిన ట్రాప్ ను ఓ వ్యక్తి బయటపెట్టాడు. ఏటీఎంలో కార్డ్ పెట్టి డబ్బులు రాకపోతే మనం వెళ్లిపోతాం.. మళ్లీ రిటర్న్ అవుతాయని అనుకుంటాం.. కానీ ఇక్కడ కేటుగాళ్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఏకంగా డబ్బులు బయటకొచ్చినా మన చేతికి రాకుండా మాస్టర్ ప్లాన్ వేశారు.

ఏటీఎంలోకి వెళ్లి మనం అన్ని పిన్ లు ఇతర ఎంటర్ చేశాక డబ్బులు రాక కోసం చూస్తాం. అయితే ఇక్కడే స్కామర్లు మాస్టర్ ప్లాన్ చేశారు. డబ్బులు బయటకొచ్చే స్లాట్ లో అడ్డంగా కొన్ని ట్రాప్ లు పెడుతున్నారు. లోపల నుంచి బయటకు డబ్బు రాకుండా అడ్డంగా స్టికర్లు, మందపాటి చిన్న ముక్కలను అడ్డంగా లోపల పెడుతున్నారు. దీంతో డబ్బులు లోపల నుంచి బయటకు రావు. మనకు మాత్రం డబ్బులు కట్ అయినట్టుగా చూపిస్తుంది. ఇదో కొత్త స్కాం.

అందుకే ఇప్పుడు ఏదీ సురక్షితం కాని పరిస్థితి నెలకొంది. ఏటీఎం విత్ డ్రాలోనూ కొత్త స్కాం కలవరపెడుతోంది. క్యాష్ స్లాట్ లో ట్రాప్ పెట్టి డబ్బులు రాకుండా చేస్తున్న సైబర్ మోసగాళ్ల తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మీరు ఏటీఎం పెట్టి డబ్బు రాకపోతే వెంటనే ఏటీఎం వదిలి వెళ్లకండి.. అక్కడే అడ్డంగా స్టిక్కర్లు పెట్టి మీరు వెళ్లాక డబ్బులు దోచుకునే కేటుగాళ్లు పక్కనే సిద్ధంగా ఉంటారు. మీరు వెళ్లిపోయాక ఆ డబ్బులు కొట్టేస్తారు.

డబ్బులు రాని మరుక్షణం వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడమో.. లేక కింద ఏటీఎం మనీ వచ్చే వద్ద ఒకసారి చెక్ చేయడమో చేయండి. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఈ కేటుగాళ్ల పరం అవ్వడం ఖాయం.

డబ్బులు ఊరికే రావు అని ఓ పెద్ద మనిషి ఊరికే అనలేదు. ఆ డబ్బుల కోసం ఆఖరుకు ఏటీఎంలను కూడా వదలకుండా మోసాల్లో డిగ్రీలు చేసేస్తున్నారు కేటుగాళ్లు. మరి మీరు ఇక నుంచి ఏటీఎంల వద్దకు వెళ్లితే జర జాగ్రత్త సుమా..