Begin typing your search above and press return to search.

న్యూయార్క్ కు వచ్చారో...అరెస్ట్ అంతే...

గాజాపై యుద్ద నేపథ్యంలో ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు మాజీ రక్షణమంత్రి యోవ్ గాలంట్ పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

By:  Tupaki Political Desk   |   4 Dec 2025 5:00 PM IST
న్యూయార్క్ కు వచ్చారో...అరెస్ట్ అంతే...
X

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు కొత్త చిక్కొచ్చి పడింది. పాపం అతను న్యూయార్క్ ను చూడాలని తహతహ లాడిపోతుంటే...మేయర్ మామ్దానీ మాత్రం ఎలా వస్తారు? మీపై అసలే అంతర్జాతీయ క్రిమినల్ కేసులున్నాయి. అరెస్ట్ వారంట్ ఉంది. పొరపాటున ఉత్సాహం కొద్ది వచ్చారో మీ సరదా తీరిపోతుంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం అంటూ స్వీట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మామ్దానీ..

గాజాపై యుద్ద నేపథ్యంలో ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు మాజీ రక్షణమంత్రి యోవ్ గాలంట్ పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ సభ్య దేశాల్లో వీరిద్దరు వస్తే అరెస్ట్ చేసే అధికారం ఆ దేశాలకు ఉంది. రష్యా ప్రధాని పుతిన్ పై కూడా ఐసీసీ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ అనేక నేరాలకు పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. అయితే భారత్ లో పర్యటించనున్న పుతిన్ కు మాత్రం ఈ అరెస్ట్ ముప్పు లేదని భారత్ అంటోంది. ఐసీసీ పరిధిలో మనదేశం లేనందున పుతిన్ ను అరెస్ట్ చేసే బాధ్యత మనకు లేదని భారత్ అంటోంది. కానీ నెతన్యాహూకు మాత్రం న్యూయార్క్ కు వెళితే అరెస్ట్ తప్పనిసరి అని అక్కడి మేయర్ మామ్దాని అంటున్నారు..

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ మనుసులో కోరిక వ్యక్తం చేశారు. తనకు అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని సందర్శించాలని ఉందని తెలిపారు. మరి మేయర్ మామ్దాని దీనికి అంగీకరిస్తారా...వారితో మాట్లాడుతారా? అన్న మీడియా ప్రశ్నకు నెతన్యాహు స్పందిస్తూ...మామ్దానీ తమ ఆలోచనా తీరు మార్చుకోవాలి. ఈ భూమిపై మనకు జీవించే హక్కు ఉందని మామ్దానీ చెబితే...ఆ మాటే మన సంభాషణకు శుభారంభం అవుతుందని వ్యాఖ్యానించారు..

కాగా డెమాక్రటిక్ సోషలిస్ట్ మామ్దానీ ఇటీవల న్యూయర్క్ ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఓ యుద్ధ నేరస్థుడిగా విమర్శించారు. నెతన్యాహు తీరు పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తను మేయర్ గా గెలిచాక నెతన్యాహు న్యూయార్క్ కు వస్తే...అతణ్ని ఏమాత్రం ఆలోచించకుండా అరెస్ట్ చేస్తానని అన్నారు. కానీ ఇంత జరిగినా నెతన్యాహు మాత్రం తాను తప్పకుండా న్యూయార్క్ వెళతాననే అంటున్నారు. అరెస్టు హెచ్చరికల్ని ఆచరణలో చూపడం అంతసులువు కాదని అంటున్నారు. చూడాలి మరి నెతన్యాహు న్యూయార్క్ కు వెళతారా...తన కోరిక తీరుతుందా...లేద మమ్దానీ అన్నట్లు సరదా తీరిపోతుందా...?