నేపాల్ ప్రమాదం కారణాలు ఏంటి ?
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద మూలంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 28 Aug 2026 8:00 PM ISTనేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద మూలంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 470, టిబెట్లో ముగ్గురు మరణించినట్లు చెబుతుండగా, నేపాల్ లో 910, టిబెట్లో 558 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కైలాస మానస సరోవర యాత్రకు వచ్చిన విదేశీయులు, పర్యాటకులు ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రధానంగా నేపాల్ లోని రసువా జిల్లాలోని టిమూరే, స్యాబ్రుబేసి, దిగువన నువాకోట్, దాడింగ్ జిల్లాలు ప్రభావితం అయ్యాయి. వరదనీరు భోటేకోశి నది ద్వారా త్రిశూలీ నదిలోకి ప్రవహించి ఈ ప్రాంతాలు అన్నింటినీ ముంచెత్తింది. టిబెట్ వైపు గిరోంగ్ కౌంటీలోనూ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో 19కి పైగా వంతెనలు, 40 కిలోమీటర్లకు పైగా రహదారులు ధ్వంసం అయ్యాయి. రెస్కూ ఆపరేషన్లు నడుస్తున్న నేపథ్యంలో గల్లంతయిన, మరణించిన వారి సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది.
మానస సరోవర యాత్రకు కుటుంబ సమేతంగా లండన్ నుండి వెళ్లిన విజయనగరం పార్వతీపురం పండా వీధికి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబం ఈ ప్రమాదంలో గల్లంతయింది. వీరి వాహనం ఒక వంతెన దాటుతున్న సమయంలో వరద ముంచెత్తి వాహనం అందులో కొట్టుపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు నేపాల్ గైడ్ సంతోష్ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
20 ఏళ్లుగా లండన్లో స్థిరపడిన సంతోష్ కుమార్ సాహూ కుటుంబం మానస సరోవర యాత్రకు భార్య సురభి, కుమారుడు స్పందన్, కూతురు సైనాలతో కలిసి వెళ్లారు. ప్రస్తుతం సంతోష్ తల్లిదండ్రులు దక్షిణాఫ్రికాలోని రెండో కుమారుడి వద్ద ఉన్నట్లు సమాచారం. మొత్తం ఒక తెలుగు కుటుంబం తుడిచిపెట్టుకుపోవడం పార్వతీపురంలో విషాదం నింపింది.
లాంగ్ టాంగ్ లిరుంగ్ పర్వతం ఉత్తర ముఖంలో సుమారు 17 వేల అడుగుల ఎత్తున కొండ చరియలు విరిగి మంచుకొండలు పతనం అయ్యాయి. ఇది లెండె ఖోలా నదిలోకి పడి తాత్కాలికంగా నది ప్రవాహానికి అడ్డుగా నిలిచింది. ఆ తర్వాత అక్కడ నిలిచిపోయిన నీరు, మట్టి, రాళ్లు, మంచు భారీ ప్రవాహంగా దిగువకు దూసుకువచ్చింది. ఈ గ్లేషియల్ కొలాప్సే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మొదట దీన్ని 4.4 భూకంపంగా అనుమానించారు.
భారత విదేశాంగ చెబుతున్న వివరాల ప్రకారం 290 మంది వరకు భారతీయుల ఆచూకీ లభించడం లేదని తెలుస్తుంది. ప్రధానంగా అప్పర్ త్రిశూలీ 1, త్రిశూలీ 3ఎ హైడ్రో పవర్ టన్నెల్ లో 350 మంది కార్మికులు చిక్కుకున్నారు. నేపాల్ ఆర్మీ రెస్యూ ఆపరేషన్ చేసి వారిని కాపాడింది. ఇందులో 63 మంది భారతీయులు ఉన్నారు. మరో వంద ఇందులో చిక్కుకున్నారని, వారి కోసం ఆపరేషన్ కొనసాగుతుంది అని చెబుతున్నారు.
