Begin typing your search above and press return to search.

మ‌ట్టి తిని.. బుర‌ద తాగి.. బ‌తికిపోయారు: భూమ్మీద నూక‌లంటే ఇదే!!

''ఆడికి భూమ్మీద ఇంకా నూక‌లున్నాయిరా!'' అనే మాట త‌ర‌చుగా వింటుంటాం. అయితే.. ఇది మాట‌వ ర‌స‌కే అన్నా.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నిజం అవుతూనే ఉంది.

By:  Garuda Media   |   6 Sept 2026 10:00 AM IST
మ‌ట్టి తిని.. బుర‌ద తాగి.. బ‌తికిపోయారు: భూమ్మీద నూక‌లంటే ఇదే!!
X

''ఆడికి భూమ్మీద ఇంకా నూక‌లున్నాయిరా!'' అనే మాట త‌ర‌చుగా వింటుంటాం. అయితే.. ఇది మాట‌వ ర‌స‌కే అన్నా.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నిజం అవుతూనే ఉంది. 9 రోజుల కింద‌ట నేపాల్‌లో సంభ‌వించిన వ‌ర‌ద ప్ర‌ళ‌యంలో వెయ్యికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రిన్ని వంద‌ల మంది అడ్ర‌స్ లేకుం డా పోయారు. ప్ర‌స్తుతం నేపాల్‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో కేవ‌లం శ‌వాల కోస‌మే గాలింపు జ‌రుగు తోంది. ఎందుకంటే.. 9 రోజుల త‌ర్వాత‌.. ఎవ‌రూ బ‌తికి ఉండే అవ‌కాశం లేద‌ని.. నిద్రాహారాలు.. గుక్కెడు నీరు లేకుండా ప్రాణాలు నిల‌వ‌వ‌ని వైద్యులు ధ్రువీక‌రించ‌డ‌మే.

కానీ, చిత్రంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. దాదాపు 9 రోజులుగా వారు న‌ర‌కం అనుభ‌వి స్తూనే ప్రాణాల‌తో స‌జీవంగా ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఆ వెంట‌నే వారిని ఆసుప త్రికి త‌ర‌లించి ఆక్సిజ‌న్‌తోపాటు ప్రాణాధార ఔష‌ధాల‌ను ఎక్కిస్తున్నారు. ఈ పరిణామ‌మే.. భూమ్మీద నూక‌లు ఉండడం అంటే ఇదే.. అనే మాట‌ను వినిపించేలా చేసింది.

ఎలా బ్ర‌తికారు?

నేపాల్‌లో సంభ‌వించిన ప్ర‌ళ‌య వ‌ర‌ద‌ల్లో.. కీల‌క‌మైన త్రిశూలి జ‌ల విద్యుత్ ప్రాజెక్టు వ‌ద్ద‌.. ప‌నుల్లో నిమ గ్న‌మైన 362 మంది క‌నిపించ‌కుండా పోయారు. వారిలో కేవ‌లం 31 మంది మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకులాట జ‌రుగుతోంది. అయితే.. వారెవ‌రూ ప్రాణాల‌తో ఉండే ప‌రిస్థితి లేద‌ని అధికారులు అంచ‌నా వేశారు.

కానీ, అనూహ్యంగా మెకానిల్ ఫోర్‌మ్యాన్ షా(30), త్రిశూలీ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ అమిర్ మహర్జన్‌(45)లు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు. అది కూడా.. 9 రోజుల త‌ర్వాత‌.. పూర్తిగా బుర‌ద‌, రాళ్ల‌తో కూరుకుపోయిన సొరంగంలో వారు ప్రాణాల‌తో ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. అదేస‌మ‌యంలో వారి ప‌ట్ల దేవుడిని ప్రార్థించేలా కూడా చేసింది.

మ‌ట్టి తిని..

కూరుకుపోయిన బుర‌ద ఎండిపోక ముందే.. దాని నుంచి కొంత త‌ల‌ను బ‌య‌ట పెట్టి.. ఇద్ద‌రూ శ్వాస పీల్చుకున్న‌ట్టుగా అధికారులు చెబుతున్నారు. కానీ, వారి చేతులు.. కాళ్లు మాత్రం పూర్తిగా బుద‌ర‌లో కూరుకుపోయాయ‌న్నారు. ఇక‌, ఆక‌లికి తాళ‌లేక మ‌ట్టినే తిన్న‌ట్టు చెబుతున్నారు. బుర‌ద నీటినే తాగిన‌ట్టు తెలిపారు. అయితే.. మ‌రో 12 గంట‌లు గ‌డిచి ఉంటే.. వారి ప్రాణాలు కూడా ద‌క్కేవి కావ‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. ఇలా మ‌ట్టికింద కూరుకుపోయి.. ప్రాణాల‌తో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేశారు.