Begin typing your search above and press return to search.

రిపోర్టు: విసిగించే బ్యాచ్ తో ఉంటే వయసు పెరుగుతుంది బాస్

మన పరిచయస్తుల్లో.. స్నేహితుల్లో నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండే వారితో కలిసి ఉంటే.. మన బయలాజికల్ వయసు కంటే మానసిక వయసు మరింత పెరుగుతుందన్న విషయాన్ని వెల్లడించింది.

By:  Garuda Media   |   11 March 2026 10:11 AM IST
రిపోర్టు: విసిగించే బ్యాచ్ తో ఉంటే వయసు పెరుగుతుంది బాస్
X

అందరూ ఒకేలా ఉండరు కదా. అనుక్షణం కేరింగ్ గా చూసుకునే స్నేహితుడు.. కష్టం వస్తే నేను ఉన్నానంటూ అండగా నిలిచే మిత్రుడు.. సాయానికి ప్రతిరూపంగా ఉండే పరిచయస్తులు మాత్రమే కాదు.. అదే పనిగా నెగిటివ్ ఆలోచనలతో ఉండే జిడ్డు బ్యాచ్ ఫ్రెండ్.. తన తీరుతో అదే పనిగా విసిగించేటోళ్లు.. తమ చేతలతో వేధింపులకు గురి చేసే నెగిటివ్ బ్యాచ్ కూడా మన పరిచయస్తుల్లోనూ.. తెలిసినోళ్లలోనూ ఉంటారు. అలాంటోళ్ల విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది తాజా రిపోర్టు.

మన పరిచయస్తుల్లో.. స్నేహితుల్లో నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండే వారితో కలిసి ఉంటే.. మన బయలాజికల్ వయసు కంటే మానసిక వయసు మరింత పెరుగుతుందన్న విషయాన్ని వెల్లడించింది. నెగిటివ్ బంధాలు మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న విషయంపై పెద్ద ఎత్తున పరిశోధన చేసిన అధ్యయనకారులు ఆసక్తికర అంశాల్ని గుర్తించారు. తాము గుర్తించిన వివరాల్ని ప్రోసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో తాజాగా పబ్లిష్ అయ్యాయి. ఇంతకూ ఈ అధ్యయనాన్ని ఎవరు చేశారు? ఏయే అంశాల మీద చేశారు? అందులో గుర్తించిన అంశాలేంటి? అన్న విషయాల్లోకి వెళితే..

న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు అమెరికాలోని ఇండియా రాష్ట్రానికి చెందిన 2345 మంది నుంచి వారి లాలాజలాన్ని సేకరించారు. వారికి డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించారు. దీని ఆధారంగా నెగిటివ్ బంధాలతో చోటు చేసుకునే మార్పుల్ని విశ్లేషించారు. ఈ వైద్య పరీక్షలో పాల్గొన్న వారిలో 30 శాతం మంది తాము నెగిటివ్ భావాల్ని కలిగించే ఒక్క వ్యక్తి అయినా వతమ స్నేహితుల్లో కానీ.. బంధువుల్లో కానీ ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాంటి వారితో కలిసి ఉన్న బాధితుల్లో ఎక్కువగా మహిళలు.. రోజూ ధూమపానం చేసేవారు ఉన్నట్లుగుర్తించారు. అంతేకాదు.. అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. బాల్యంలో ఇబ్బందులకు గురైన వారే ఉండటం ఆసక్తికరం.

అలా నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక వ్యక్తి కారణంగా మన వయసు ఒకటిన్నర శాతం ఎక్కువగా పెరుగుతుందని.. బయోలాజికల్ వయసు అసలు కంటే తొమ్మిది నెలలు అధికంగా ఉంటుందని తేల్చారు. ప్రతికూల వ్యక్తులు పరిచయస్తులుగా ఉంటే.. వారితో భావోద్వేగ అనుబంధం పెద్దగా ఉండదు. అలాంటి వారి కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం తక్కువని చెప్పింది. అదే సమయంలో ఆందోళనలో ఉంటూ బయోలాజికల్ వయసు ఎక్కువగా ఉన్నోళ్లు.. నెగిటివ్ ఆలోచనలతో ఉన్న వ్యక్తులను ఆకర్షించే వీలుందని పేర్కొన్నారు. మొత్తంగా ప్రతికూల ఆలోచనలు ఉన్న వారికి దూరంగా ఉండకున్నా.. దగ్గరగా మాత్రం ఉండొద్దన్న విషయాన్ని ఈ అధ్యయనం చెప్పిందని చెప్పాలి.