ఏపీలో ఈ 'వ్యతిరేకం'.. ఎవరికి వ్యతిరేకం ..!
కందుకూరు నుంచి కర్నూలు ప్రమాదం వరకు అనేక ప్రచారాలు తెరమీదికి వచ్చాయి. మొత్తంగా ఈ ప్రచారాల టార్గెట్ ఒక్కటే. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం.
By: Garuda Media | 29 Oct 2025 3:00 AM ISTప్రచారాలు పలు విధాలు. ఎన్నికల ప్రచారం.. వ్యక్తిగత ప్రచారం.. అదేవిధంగా పార్టీల ప్రచారం. అయితే.. ఇప్పుడు కొత్తగా `వ్యతిరేక ప్రచారం` అనే మాట ఇప్పుడు తెరమీదికి వచ్చింది. అగ్గిపుల్ల-కుక్కపల్ల.. కాదేదీ కవితకు అనర్హం.. అన్నట్టుగా.. వ్యతిరేక ప్రచారానికి కూడా ఏ అంశం అతీతం కాకుండా పోయింది. ఒకప్పు డు.. ఏదైనా తీవ్ర పరిణామాలు చోటు కేసుకుంటే.. వాటిపై వ్యతిరేకంగా రాజకీయ నాయకులు ప్రచారం చేసేవారు. పార్టీలు నాయకులు కూడా కామెంట్లు చేసేవారు.
ప్రభుత్వం ఇరుకున పడేది. అంతో ఇంతో సరిపుచ్చుకునేందుకు తమ వాదనను వినిపించేందుకు ప్రాధా న్యం ఇచ్చేవారు. అయితే.. ఇప్పుడు అసలు ఈ వ్యతిరేక ప్రచారం రూపం-రంగు-రుచి కూడా మారిపోయిం ది. ఏది అసలో.. ఏది నకిలీనో తెలుసుకునేంత సమయం కూడా లేనట్టుగా.. వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా.. దీనికి అపార్థాలు అంటగట్టి ప్రచారం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సందర్భం, సమయం అనేది కూడా లేకుండా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
కందుకూరు నుంచి కర్నూలు ప్రమాదం వరకు అనేక ప్రచారాలు తెరమీదికి వచ్చాయి. మొత్తంగా ఈ ప్రచారాల టార్గెట్ ఒక్కటే. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. సర్కారు ఏమీ చేయడం లేదన్న వాదనను బలంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లడం. ఈ క్రమంలోనే సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల్లోనూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజా తుఫానుపై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగుతుండడం గమనార్హం. ఈ పరిణామాలు సర్కారుకు ఇబ్బందిగా మారిన మాట వాస్తవమే.
అయితే.. ఇదే సమయంలో ఈ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు ఎంత వరకు నమ్ముతారన్నది ప్రశ్న. ఎందు కంటే.. ప్రజలకు ఇప్పుడు అనేక మాధ్యమాలు చేతిలోకి అందుబాటులో వచ్చాయి. దీంతో ఏది నిజం.. ఏది కాదు.. అనే విషయాలలో స్పష్టత వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఎప్పటికప్పు డు స్పందిస్తోంది. దీంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఫలితంగా ఎవరైతే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. వారే.. ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇది వారి వ్యతిరేకతను మరింత పెంచుతుందని కూడా చెబుతున్నారు.
