Begin typing your search above and press return to search.

ఇక ఒత్తిడి రాజీనామాలే...తస్మాత్ జాగ్రత్త !

అయితే ఆ పని చేయకుండా రాజకీయ లాభ నష్టాలు లెక్క వేసుకుంటూ తమదైన వ్యూహాలు అమలు చేస్తూ పోతే మాత్రం అవి చివరికి ఒత్తిడి రాజీనామాల దాకా వస్తాయి.

By:  Satya P   |   25 July 2026 10:53 PM IST
ఇక ఒత్తిడి రాజీనామాలే...తస్మాత్ జాగ్రత్త !
X

నైతిక రాజీనామాలు చేస్తే వారికీ పార్టీకీ కూడా ఎంతో కొంత గౌరవం పెరుగుతుంది. అయితే ఆ పని చేయకుండా రాజకీయ లాభ నష్టాలు లెక్క వేసుకుంటూ తమదైన వ్యూహాలు అమలు చేస్తూ పోతే మాత్రం అవి చివరికి ఒత్తిడి రాజీనామాల దాకా వస్తాయి. అపుడు రాజీనామా చేసినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు, విజయం మాత్రం వేరే వారిది అవుతుంది. ఇపుడు కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ది అదే పరిస్థితి. ఆయన రాజీనామా చేశారు. ఎపుడు అంటే రెండున్నర నెలలు ఆలస్యంగా. నీట్ ప్రశ్నా పత్రం లీకేజి అయింది మే 12న. అంతకు ముందు మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను అధికారికంగా రద్దు చేసింది.

చాన్స్ తీసుకోకుండానే :

రాజకీయాలు అనే కాదు ఏ విషయం మీద అయినా చాన్స్ అన్నది మన చేతిలో ఉన్నపుడే సరైన నిర్ణయం తీసుకుంటే ఆ క్రెడిట్ ఎంతో కొంత దక్కుతుంది. అలా కాకుండా అవతల కోర్టులోకి బాల్ వెళ్ళాక వారు బలంగా విసిరాక ఇక దానికి జవాబు చెప్పే క్రమంలో కానీ లేదా అనివార్యంగా కానీ చేసే రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదు. ఇదే ఇపుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో జరిగింది. ఆయన ఎందుకో రాజీనామాకు దూరంగా ఉండిపోయారు. బహుశా విద్యార్ధుల ఉద్యమాన్ని లైట్ తీసుకోవచ్చు, లేదా తమ పార్టీ పెద్దల ఆలోచనల మేరకు కూడా నడచుకుని ఉండవచ్చు. అయితే ఇపుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్ల పార్టీ ప్రభుత్వానికి తాత్కాలికంగా ఇబ్బంది అయినా ముందుకు సాగిపోతాయి. కానీ అసలైన భారీ నష్టం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ కే జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆయన రాజకీయం పూర్తిగా డోలాయమానంలో పడింది అని అంటున్నారు.

అలెర్ట్ గా ఉండాల్సిందే :

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పౌర విజయం. ఒక విధంగా విద్యార్ధులు యువత అంతా కలసి బలమైన పోరాటం నిమించి ఈ రకంగా చేయగలిగారు. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు చేరి మద్దతు ఇవ్వడం వేరే కోణంలో చూడాలి. రాజకీయ పార్టీలు వేళ్ళు అన్నీ ఎదుటి వారి మీదనే ఉంటాయి. తన దాకా వచ్చేసరికి మాత్రం అవి ముడుచుకుపోతాయి. ఈ రోజున విద్యార్ధుల ఉద్యమానికి కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మద్దతు ఇవ్వవచ్చు. రేపటి రోజున తమకు కూడా అలాంటి సంకట పరిస్థితి వస్తే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్న అంతర్గత సందేశాన్ని అవి విస్మరిస్తున్నాయని అంటున్నారు. పౌర సమాజానికి ఎవరైనా ఒక్కటే. వారు వీరు అయినా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇలాంటి ఘటనలు జరిగినా విద్యార్ధులు ఇదే తీరున ఉద్యమిస్తారు అన్నది అయితే మరవరాదు అని అంటున్నారు. అందుకే పాలకులు ఎపుడూ అలెర్ట్ గా ఉండాల్సిందే అన్నది తాజా ఉదంతం స్పష్టం చేసింది అని అంటున్నారు.

అంత ఈజీ కాదు :

ఒకరికి నైతిక పాఠాలు చెప్పినంత ఈజీ కాదు ఎవరికి వారు పాటించడం. ఈ రోజున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వేలెత్తి చూపించవచ్చు. రేపు ఇంకొకరు రావచ్చు. అంతే కాదు వివిధ రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. అవి కూడా ఇపుడు తగిన జాగ్రత్తలతో ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగే పోరాటాలు అన్నీ రాజకీయ పార్టీల నుంచి వచ్చేవి. ఇపుడు కొత్తగా పౌర సమాజం ఎలుగెత్తుతోంది. అందుకే స్పందన కూడా భారీగా వస్తోంది. అంటే జవాబుదారీతనం మరింతగా పెరగాల్సి ఉంది అన్న మాట. దాని కంటే ముందు పాలకులు అత్యంత జాగరూకతతో ఉండాల్సిందే. ఎందుకంటే వేల కోట్ల కళ్ళు తమను నిరంతరం గమనిస్తున్నాయన్నది గుర్తు పెట్టుకుంటే వారికే మేలు. తద్వారా సమాజానికి కూడా మేలు జరుగుతుంది.