Begin typing your search above and press return to search.

మోడీ దీపావళి బొనాంజా.....వారంతా ఫుల్ ఖుషీ!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంపుతో మోడీ సర్కార్ వారి మీద తన అభిమానాన్ని చాటుకుంది. ఈ మూడు శాతం పెరుగుదల కూడా ఈ ఏడాది అక్టోబర్ నెల జీతాలతోనే అమలు అవుతుంది.

By:  Satya P   |   20 Oct 2025 5:00 AM IST
మోడీ దీపావళి బొనాంజా.....వారంతా ఫుల్ ఖుషీ!
X

దీపావళి వెలుగులు వారి ఇళ్ళకు చేరాయి. లోగిళ్ళకు కొత్త కాంతులు స్వాగతం పలికాయి. అందుకే ఈ ఏడాది అచ్చమైన దీపావళి అని వారు మురుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భారీ నజరానాలే ప్రకటించింది. ఈసారి ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు శుభవార్తలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మనసులలో సంతోష దీపావళిని నింపింది.

డీఏ సహా అనేక లాభాలు :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంపుతో మోడీ సర్కార్ వారి మీద తన అభిమానాన్ని చాటుకుంది. ఈ మూడు శాతం పెరుగుదల కూడా ఈ ఏడాది అక్టోబర్ నెల జీతాలతోనే అమలు అవుతుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ 58 శాతానికి పెరిగింది. అలాగే డీఆర్ కూడా మూడు శాతం పెరిగింది. ఇక జూలై 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుండడంతో ఉద్యోగులకు నవంబర్ నెలలో భారీగానే ఆదాయం వస్తుంది. ఇక దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 4.9 మిలియన్ల మంది, అలాగే 6.8 మంది పెన్షనర్లకు కూడా భారీగా లబ్ది చేకూరనుంది.

భారీగా బోనస్ సైతం :

అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉద్యోగుల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఏకంగా భారీగా బోనస్ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలోని గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ ఉద్యోగులకు ఈ బోనస్ కింద ఏకంగా 30 రోజుల జీతం అదనంగా దక్కనుంది. ఇక ఈ బోనస్ ని అత్యధికంగా 6 వేల 908 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బోనస్ పెంపు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయిన పోస్టల్ విభాగంలోని ఉద్యోగులకు ఏకంగా 60 రోజుల అదనపు వేతనంగా దక్కుతుంది. అలాగే సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖతో పాటు ఈమాటు గ్రామీణ్ డాక్ సేవకులు, ఫుల్ టైమ్ సాధారణ కార్మికులకు సైతం బోనస్ ఇవ్వడం విశేషంగా చెబుతున్నారు.

ఆరోగ్య పధకంతో ఊరట :

ఏకంగా పదిహేనేళ్ళ కాలం తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పధకం రేట్లను కేంద్రం సవరించడం ఈ దీపావళికి అందిన మరో శుభవార్త గా చూస్తున్నరు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా ఉద్యోగులకు అందే సేవల విలువ మరింతగా పెరుగుతుంది. ఈ రేట్ల పెంపు కూడా ఈ నెల 13వ తేదీ నుంచి వర్తిస్తుంది. దేశంలోని అనేక మహా నగరాలను పరిగణనలోకి తీసుకుని వివిధ చికిత్సలకు ప్రస్తుత పరిస్థ్తితులకు అనుగుణంగా ధరలు పెంచారు. ఈ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంలోని లక్షల మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరనుంది.

ఇంకా చాలానే :

అదే విధంగా కేంద్రం తీసుకుని వచ్చిన కొత్త పెన్షన్ స్కీం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇకపైన ఉద్యోగులకు పెంచిన రిటైర్మెంట్, గ్రాట్యూటీ బెనిఫిట్స్ బాగానే పొందుతారు. అలాగే ఎన్‌పీఎస్‌లో వచ్చిన మాదిరిగానే యూపీస్ లోనూ ఇస్తామని కేంద్రం దీపావళి వేళ శుభవార్తను వినిపించింది. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటారు. దాని కోసం కొత్తగా అనేక అవకాశాలు కల్పించారు. దాని ప్రకారం ఊస్తే ప్రత్యేక శిబిరాల ద్వారా కూడా పెన్షనర్లు వీటిని అందించవచ్చు.అలాగే వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇంటికే వెళ్లి జీవన ప్రమాణ పత్రం తీసుకుంటారు. మొత్తానికి మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బొనాంజా దీపావళి వేళ ప్రకటించింది.