కాంగ్రెస్ సైలెంట్: నవీన్ యాదవ్.. నచ్చలేదా?
అయినా.. కూడా పార్టీలో పెద్దగా ఊపు కనిపించడం లేదన్నది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఇంత సైలెంట్ కావడం వెనుక.. అభ్యర్థి ఎంపికేనని తెలుస్తోంది.
By: Garuda Media | 15 Oct 2025 5:57 PM ISTఒక వైపు ప్రధాన ప్రత్యర్థి.. బీఆర్ ఎస్ పార్టీ దూకుడుగా ఉంది.. మరోవైపు.. ఆ పార్టీ అభ్యర్థి సెంటిమెంటును రాజేస్తున్నారు. కన్నీరు పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇది తప్పుకాకపోయినా.. రాజకీయాల్లో అంతే వేడి పుట్టించేలాగా.. కాంగ్రెస్ కూడా పుంజుకోవాల్సి ఉంటుంది కదా!. కానీ.. ఇప్పటి వరకు బీఆర్ ఎస్ రేంజ్‌లో కాంగ్రెస్ దూకుడు కనిపించడం లేదు. పెద్దగా నాయకులు కూడా ఎవరూ స్పందించడం లేదు. నిజానికి చాలా వరకు జూబ్లీహిల్స్‌లో తెలంగాణ వాదం వినిపించే వారికంటే కూడా సెటిలర్లు ఎక్కువ.
వీరిని మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెటిల ర్లతో కలిసి కాంగ్రెస్ నాయకులు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అయినా.. కూడా పార్టీలో పెద్దగా ఊపు కనిపించడం లేదన్నది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఇంత సైలెంట్ కావడం వెనుక.. అభ్యర్థి ఎంపికేనని తెలుస్తోంది. ఆది నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పెత్తనాన్నికొందరు నాయకులు విభేదిస్తున్నారు.
ఎవరు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా.. రేవంత్ రెడ్డి నిర్ణయాలను చాలా మంది మంత్రులు కూడా విభేది స్తున్నారు. అందుకే.. తరచుగా ఢిల్లీ పెద్దల జోక్యం ఉంటోంది. ఇక, తాజాగా ఎన్నికల్లోనూ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం వెనుక ముందుగానే నిర్ణయించేశారని.. కానీ, తమతో కమిటీ వేసి.. పైపైన చర్చలు జరిపా రని నాయకులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మాత్రానికే.. ఇన్ని చేయడం ఎందుకన్న ది కూడా వారి ప్రశ్న. ఈ వ్యవహారం పెద్ద స్థాయి నాయకుల్లో చర్చగా ఉండగా.. క్షేత్రస్థాయిలో మరో వాదన ఉంది.
నిన్న మొన్నటి వరకు ఎంఐఎంతో కలివిడిగా ఉన్న నవీన్‌తో కలిసి ఎలా తిరుగుతామని కొందరు చెబుతు న్నారు. పైగా నవీన్‌కు బీఆర్ ఎస్ నేతలకు మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయని కొందరు వ్యాఖ్యా నిస్తున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో పెద్దగా ఊపు కనిపించడం లేదు. అయితే.. మరికొందరు సీఎం జోక్యం చేసుకుంటే ఈ సమస్యలు సర్దుబాటు అవుతాయని చెబుతున్నారు. కానీ.. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఇష్టపడడం లేదు. ఇది స్థాయికి తగదని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో నవీన్ యాదవ్ తరఫున పెద్దగా ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదు.
