Begin typing your search above and press return to search.

ఈరోజు స్నేహితురాళ్ల దినోత్సవం.. విశిష్టత ఏంటి? ఎలా మొదలైందో తెలుసా?

ఈరోజు జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే కావడంతో.. అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు రూపొందించబడింది? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటో చూద్దాం..

By:  Priya Chowdhary Nuthalapti   |   1 Aug 2025 11:29 AM IST
Why is National Girlfriends Day Celebrated?
X

ఈరోజు జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే కావడంతో.. అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు రూపొందించబడింది? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటో చూద్దాం..

మదర్స్ డే.. ఫాదర్స్ డే.. బ్రదర్స్ డే.. సిస్టర్స్ డే.. ఇలా ప్రతి రిలేషన్ కి..ఈమధ్య ఎక్కువగా ఒకరోజు కేటాయించడం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డేస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ బంధాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు "జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే" కూడా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే అంతర్జాతీయ స్నేహ దినోత్సవం పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు "జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే" జరుగుతోంది. సాధారణంగా మనందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు..అయితే వారికోసం ఒక ప్రత్యేకమైన దినోత్సవం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చారిత్రక అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఈ స్నేహితురాళ్ల దినోత్సవం ఎందుకు ప్రవేశ పెట్టబడింది? ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకోవాలి? అసలు చరిత్రలో ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ దినోత్సవం ఉద్దేశం ఏమిటంటే.. కేవలం స్నేహం మాత్రమే.. కానీ ఒక అబ్బాయి, అమ్మాయి కలిశారు అంటే వారి మధ్య ప్రేమ ఉందంటూ.. అపార్థం సృష్టించబడుతున్న సమాజంలో ఉన్న మనం.. అసలు గర్ల్ ఫ్రెండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాము. ముఖ్యంగా స్నేహితురాళ్ల గురించి నలుగురికి చెప్పుకొని, వారికి శుభాకాంక్షలు చెప్పడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అది ఆమె ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా చాలామందికి స్నేహితులే విజయానికి కారణం అవుతూ ఉంటారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలు స్నేహితులని ముందుకు నడిపించగలవు. అందుకే ఒక మంచి స్నేహితురాలు మీకు వుంటే.. కచ్చితంగా మీరు ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. స్నేహం నుంచి క్రమంగా ప్రేమ పుట్టడం సహజమే కానీ ఈ దినోత్సవాన్ని మాత్రం స్నేహితులని స్నేహితులు గానే చూస్తూ.. మంచి స్నేహాన్ని చాటుతూ శుభాకాంక్షలు చెప్పమంటుంది ఈ జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే.

దీనిని ఎప్పుడు ప్రారంభించారు అనే విషయానికొస్తే.. 2004 ఆగస్టు ఒకటిన లగ్జరీ లైఫ్ స్టైల్ గురువైన సుశాన్ ఈ జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ దినోత్సవాన్ని సృష్టించారు. ఈ రోజున మహిళా స్నేహితురాళ్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. క్రమంగా ఇది మరింత విస్తరించింది. అటు అబ్బాయిలు కూడా అమ్మాయిలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ గర్ల్ ఫ్రెండ్ అనే పదం 1863లో వాడుకలోకి వచ్చింది. ఇక కాలక్రమేనా 1920లో దాని అర్థమే మారిపోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే మీనింగ్ ప్రియురాలిగా మారిపోయింది. అందుకే సమస్య పెద్దదిగా మారుతోంది..కనీసం ఇప్పటికైనా అసలైన గర్ల్ ఫ్రెండ్ మీనింగ్ తెలుసుకొని...మీకు ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ కి శుభాకాంక్షలు చెప్పాలి అని సదరు స్నేహితురాళ్లు కూడా కోరుకుంటున్నారు.