Begin typing your search above and press return to search.

ఇంటికి పిలిచి నమాజ్ నేర్పించా.. నిజాన్ని చెప్పిన నిదాఖాన్!

ఇదిలా ఉండగా.. ఈ సంచలన కేసు విచారణను సిట్ కు బదిలీ చేయటం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదాఖాన్ ను సిట్ అధికారులు విచారించారు.

By:  Garuda Media   |   10 Jun 2026 10:30 AM IST
ఇంటికి పిలిచి నమాజ్ నేర్పించా.. నిజాన్ని చెప్పిన నిదాఖాన్!
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నాసిక్ టీసీఎస్ యూనిట్ ఇష్యూలో ఇప్పుడు మరిన్ని సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మత మార్పిడికి పాల్పడటం..ఇందులో భాగంగా బలవంతపు ఒత్తిళ్లు.. లైంగిక వేధింపులకు గురి చేయటం లాంటి ఉదంతాలు తెలిసిందే. ఈ మొత్తం ఇష్యూలో డానిష్.. తౌసీఫ్ లతో కలిసి హెచ్ ఆర్ విభాగానికి చెందిన నిదాఖాన్ లు ఒక జట్టుగా మారి.. ఆఫీసులోని మహిళల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయటం తెలిసిందే. ఈ ఉదంతంలో బాధితురాలు ఒకరు ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఈ దారుణ ఉదంతం వెలుగు చూసింది.నాసిక్ టీసీఎస్ ఆఫీసులోని దాదాపు పన్నెండు మంది మహిళల్ని మతం మార్చేందుకు వీలుగా కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు ఉన్నాయి

ఇదిలా ఉండగా.. ఈ సంచలన కేసు విచారణను సిట్ కు బదిలీ చేయటం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదాఖాన్ ను సిట్ అధికారులు విచారించారు.ఈ విచారణతో ఆమె సంచలన అంశాల్ని వెల్లడించటమే కాదు.. తాను చేసిన చర్యలను ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. టీసీఎస్ ఆఫీసులోని కేఫ్ టేరియాలో మత మార్పిల్లు.. బలవంతంగా మతాన్ని రుద్దే కుట్రకు తెర తీసినట్లుగా తెలుస్తోంది. నాసిక్ టీసీఎస్ ఏడో అంతస్తులో ఉన్న కేఫ్ లో డానిష్.. తౌసీఫ్ తో కలిసి ఈ కుట్రకు తెర తీసినట్లుగా నిదాఖాన్ అంగీకరించినట్లుగా వెల్లడైంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలిని మతం మార్చి.. ఆమె పేరును హానియాగా మార్చాలన్న కుట్ర పన్నిన వైనాన్ని విచారణలో నిదాఖాన్ ఒప్పుకున్నారు. తన బంధువులతో చాట్ చేస్తున్న సందర్భంలో తాను హానియాతో బయటకు వెళుతున్నట్లుగా పేర్కొనగా.. ఎవరీ హానియా అని వారు ప్రశ్నిస్తే..‘మతం మార్చుకున్న ఆ అమ్మాయి’ అని బదులు ఇచ్చిన వాట్సప్ చాట్ ను కూడా విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. మతం మార్చి.. పేరు మార్చిన బాధితురాలి కొత్త పేరుతో నకిలీ పత్రాలను క్రియేట్ చేసే ప్రయత్నాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఆఫీసులో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఇస్లాం సంప్రదాయ దుస్తులైన బురఖాను ధరించి ఆఫీసుకు వచ్చేలా ఒత్తిడి చేయటం.. వారికి అవసరమైన దుస్తుల్ని అందించిన అంశాన్ని ఒప్పుకున్నట్లుగా నిదాఖాన్ విచారణలో అంగీకరించారని తెలుస్తోంది. బాధితురాలిని తన ఇంటికి పిలిపించుకొని నమాజ్ ఎలా చేయాలన్న దానిపై తాను శిక్షణ ఇచ్చినట్లుగా ఒప్పుకున్నట్లుగా వెల్లడైంది. అంతేకాదు.. బాధితురాలి కుటుంబ సభ్యులకు ఉద్యోగంలో భాగంగా రెండేళ్లు బయటకు వెళుతున్నట్లుగా అబద్ధం చెప్పాలని బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది.

బాధితురాలి మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా.. అందులో 37 ఆడియో క్లిప్ లు.. మతపరమైన అంశాలకు సంబంధించిన నాలుగు యాప్ లు.. సుమారు 171 ఇస్లామిక్ కంటెంట్ లింకులను పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పాక్ కు చెందిన ఇస్లామిక్ మత గురువుల వీడియోలను బాధితురాలి చేత బలవంతంగా చూసేలా చేశారన్న విషయం వెల్లడైంది. మొత్తంగా సిట్ విచారణలో తాను ఇస్లాం స్వీకరించాలన్న ఒత్తిడితో పాటు.. నమాజ్ శిక్షణ అందించినట్లుగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు మరింత షాకింగ్ గా మారింది.