Begin typing your search above and press return to search.

నెహ్రూ రికార్డుని బద్ధలు కొట్టనున్న మోడీ

ప్రధానిగా నరేంద్ర మోడీ సరి కొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. సమీప భవిషత్తులో మరెవరూ ఆ రికార్డుని అందుకోలేంత ఎత్తున ఉన్నారు.

By:  Satya P   |   4 Jun 2026 9:07 AM IST
నెహ్రూ రికార్డుని బద్ధలు కొట్టనున్న మోడీ
X

ప్రధానిగా నరేంద్ర మోడీ సరి కొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు. సమీప భవిషత్తులో మరెవరూ ఆ రికార్డుని అందుకోలేంత ఎత్తున ఉన్నారు. పైగా ఈ రోజున స్వతంత్ర్య భారత దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రికార్డు తొలి ప్రధాని పండిట్ నెహ్రూ పేరు మీద ఉంది. దానిని అతి తొందరలోనే నరేంద్ర మోడీ బద్ధలు కొట్టబోతున్నారు. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ అరుదైన సమయం ఆ రేర్ డేట్ ఎపుడూ అంటే జూన్ 10 అని చెబుతున్నారు. అంటే సరిగ్గా వారం రోజులలో అన్న మాట.

నంబర్ వన్ ప్రధానిగా :

ఇక మోడీ జూన్ 10 నాటికి దేశంలో అత్యధిక కాలం సుదీర్ఘమైన పాలన అందించిన ప్రధానిగా గ్రేట్ రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఆయన ఆ రోజుకు ఆయన ప్రధానిగా 4 వేల 399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. నరేంద్ర మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకూ వరుసగా మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. దాంతో ఆయన ప్రధానిగా ఇన్ని వేల రోజులు తన సేవలు అందించినట్లు అయింది గత ప్రధానులను అధిగమించి నట్లు కూడా అయింది అని గుర్తు చేస్తున్నారు.

నెహ్రూ ఇందిర రికార్డులు బ్రేక్ :

ఇక మోడీ ఇంత ఎక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ద్వారా పండిట్ నెహ్రూ శ్రీమతి ఇందిరా గాంధీ రికార్డులను బద్దలు కొట్టారు. నెహ్రూ చూస్తే 1952 మే 13న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 మే 27 న మరణించేంటంతవరకూ ప్రధానిగానే కొనసాగారు. ఈ లెక్కన నెహ్రూ 4,398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇపుడు మోడీ జూన్ 10 తో 4 వేల 399 రోజుల పాలన పూర్తి చేసుకోవడం ద్వారా ఆ రికార్డుని బ్రేక్ చేయనున్నారు. ఇక దీని కంటే ముందే ఇందిరా గాంధీ రికార్డు సైతం బ్రేక్ అయింది. 2025 జులై 25న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉన్న 4 077 రోజుల నిరంతరాయ పాలన రికార్డును మోదీ దాటేశారని గుర్తు చేస్తున్నారు.

ఇవన్నీ కొత్త రికార్డులే :

అంతే కాదు తొలి ప్రధాని నెహ్రూ తరువాత వరసగా మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయిన రికార్డు మోడీకి ఉంది. దానిని ఆయన 2024 ఎన్నికల తరువాత సాధించారు. ఇందిరా గాంధీ అయితే వరసగా మూడు సార్లు ప్రధాని అయిన రికార్డు లేదు. ఆమె మధ్యలో ఒకసారి ఓడిపోయి 1980లో మళ్ళీ మూడోసారి ప్రధాని అయ్యారు అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డులను ఎవరూ అందుకోలేరని అంటున్నారు. మరో వైపు 2029 నాటి వరకూ మోడీ ప్రధానిగా ఉంటారు కాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే భారత దేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం అంటే 8 వేల930 రోజులకు పైగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా మోదీ అరుదైన ఘనమైన పెద్ద రికార్డునే క్రియేట్ చేసి దేశం ముందు ఉంచారు. 2029 నాటికి ఆయన పాలన అయితే 10 వేల రోజులకు చేరుకుంటుంది అని కూడా చెబుతున్నారు.