Begin typing your search above and press return to search.

రికార్డుల మోడీ...ఇప్పట్లో నో బ్రేక్

నరేంద్ర మోడీ ఒక విశిష్టమైన నాయకుడిగా చూడాలి. ఆయన వయసు యాభై ఏళ్ళు వచ్చేంతవరకూ చట్ట సభల వైపే చూడలేదు.

By:  Satya P   |   22 March 2026 9:00 PM IST
రికార్డుల మోడీ...ఇప్పట్లో నో బ్రేక్
X

నరేంద్ర మోడీ ఒక విశిష్టమైన నాయకుడిగా చూడాలి. ఆయన వయసు యాభై ఏళ్ళు వచ్చేంతవరకూ చట్ట సభల వైపే చూడలేదు. ఆయన ఆర్ఎస్ఎస్ లో సుదీర్ఘ కాలం పనిచేశారు. 1986లో ఎల్ కే అద్వానీ బీజేపీకి రెండవ జాతీయ అధ్యక్షుడు అయినపుడు తన సొంత రాష్ట్రం గుజరాత్ కి చెందిన మోడీని బీజేపీలోకి తీసుకున్నారు. అలా పార్టీ రాజకీయాల్లో మోడీ పనిచేయడం మొదలైంది. ఇది కూడా సుదీర్ఘకాలం సాగింది. 2021 వరకూ అంటే పదిహేనేళ్ళ పాటు పార్టీ పదవులలోనే మోడీ ఉన్నారు. ఆయన తలచుకుంటే గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవవచ్చు, మంత్రి కూడా కావచ్చు. గుజరాత్ లో అప్పటి సీఎం కేశూభాయి పటేల్ తో మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ పార్టీ కోసమే మోడీ పని చేస్తూ తెర వెనక ఉన్నారు.

పాలకుడిగా తొలి అడుగు :

ఇక నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగానే నేరుగా 2001లో బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. ఆ మరుసటి ఏడాదే 2002లో ఎన్నికలు వస్తే ఎదుర్కొని మోడీ బీజేపీని గెలిపించారు అలా తన హయాంలో 2007, 2012లలో బీజేపీని గెలిపించి ముమ్మరు సీఎం గా ఏకంగా 13 ఏళ్ళ పాటు కొనసాగారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి వచ్చి 2014 మే 26 నుంచి ప్రధాని గా కొనసాగుతున్నారు. సీఎం గా మూడు సార్లు పీఎం గా మరో మూడు సార్లు అంటే ఆరు సార్లు ఓటమి ఎరగని నేతగా మోడీ నిలిచి గెలిచారు. ఈ రోజు తో అంటే మార్చి 22తో మోడీ పాలకుడిగా 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో సిక్కిం సీఎం గా రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన పవన్ కుమార్ చాంలింగ్ రికార్డుని బద్ధలు కొట్టినట్లు అయింది.

పెరిగేదే కానీ :

ఇక ముఖ్యమంత్రిగా ఎంతో మంది రెండు దశాబ్దాల కంటే ఎక్కువగా చేశారు. ప్రధానిగా చూస్తే నెహ్రూ అత్యధిక కాలం అంటే పదిహేడేళ్లకు పైగా పనిచేశారు ఆ తరువాత ఇందిరాగాంధీకి ఆ క్రెడిట్ దక్కుతుంది. మోడీ 2029 దాకా కొనసాగుతారు కాబట్టి ఇందిరాగాంధీ రికార్డుని తొందరలోనే బద్ధలు కొడతారు. 2029లో మరోసారి గెలిచి నాలుగవ సారి దేశానికి ప్రధాని అయితే మాత్రం నెహ్రూ రికార్డులు సైతం పక్కకు వెళ్తాయి. అంతే కాదు ఇలా సీఎం గా ప్రధానిగా ఇంత కాలం పనిచేసిన వారు మరొకరు ఉండే చాన్స్ లేదు, ఇప్పట్లో ఈ రికార్డు కూడా బద్ధలు అయ్యే అవకాశాలు అసలు కనిపించడం లేదని అంటున్నారు.

డిజిటల్ రంగంలోనూ :

ఇక మోడీ ఈ ఏడాది ముఖ్యంగా డిజిటల్ రంగంలో కూడా ముఖ్యమైన మైలురాళ్లను అధిగమించారు. ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పది కోట్ల మంది ఫాలోవర్లను దాటి అరుదైన మైలురాయిని సాధించిన అధికారంలో ఉన్న ప్రపంచ నాయకుడుగా రాజకీయవేత్తగా నిలిచారు. ఈ నెల ప్రారంభంలో ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో మూడు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో అత్యధికంగా ఫాలోవర్స్ తో ప్రపంచ నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు దీంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలతో పాటు మాజీ ప్రభుత్వ అధినేతలందరిలోనూ అగ్రస్థానంలో ఉన్నారు, ఇతర ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ నాయకుల కంటే చాలా ముందున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆయనకు 101 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో సైతం మోదీకి 106.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.