Begin typing your search above and press return to search.

రామ్మోహన్ తో సన్ ఆఫ్ ధర్మాన ఢీ

శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనది. రాజకీయంగా చైతన్యవంతమైనది.

By:  Satya P   |   27 Oct 2025 9:02 AM IST
రామ్మోహన్ తో సన్ ఆఫ్ ధర్మాన ఢీ
X

శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనది. రాజకీయంగా చైతన్యవంతమైనది. ఇక్కడ నుంచి అనేక సార్లు ధర్మాన కుటుంబం ఎన్నికల్లో గెలిచింది. ధర్మాన ప్రసాదరావు మొదటి సారి 1989లో ఇక్కడ నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు. 1994లో ఓటమి చెందిన ఆయన 1999లో మరోసారి గెలిచారు 2004లో ధర్మాన క్రిష్ణదాస్ రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు 2009, 2012 ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు అయితే 2014లో ఓటమి పాలు అయ్యారు. 2019లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో మరోసారి ఓటమి దక్కింది. మొత్తం మీద చూస్తే గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో ధర్మాన కుటుంబం మూడు సార్లు మాత్రమే ఓడింది అంటే గట్టి పట్టు ఉన్నటే.

టీడీపీ అయిదు సార్లు :

ఇక తెలుగుదేశం పార్టీ పుట్టాక పది సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో అయిదు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ భావజాలం హెచ్చుగా ఉంటుంది. దాంతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. దాంతోనే ధర్మాన కుటుంబం కూడా ఈ నియోజకవర్గాన్ని బాగా నమ్ముకుంది. ఇక 2024 ఎన్నికల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించారు.

వచ్చే ఎన్నికల నాటికి :

ఇక రామ్మోహన్ నాయుడు 2024 ఎన్నికల్లోనే నరసన్నపేట నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే హైకమాండ్ ఆయనను మరోసారి లోక్ సభకు పోటీ చేయించింది. ప్రతిఫలంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. కానీ 2029లో మాత్రం కచ్చితంగా రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు ఆ మేరకు ఆయన వర్గం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. ఇక వైసీపీ వైపు చూస్తే కనుక మాజీ మంత్రి క్రిష్ణదాస్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

వారసుడికి ఎంట్రీ :

ఆయన తన రాజకీయ వారసుడిగా కుమారుడు కృష్ణ చైతన్యను పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే క్రిష్ణ చైతన్య జనాల్లోకి వెళ్తున్నారు. వైసీపీ పార్టీని ఆయనే లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జెడ్పీటీసీగా ఉన్నారు. రానున్న రోజుల ఆయన మరింత దూకుడు చేస్తారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లోనే ఆయన నిజానికి పోటీ చేయాల్సి ఉంది. కానీ వైసీపీ హైకమాండ్ క్రిష్ణ దాస్ నే పోటీకి దిగమనడంతో కుమారుడు అలా ఉండిపోవాల్సి వచ్చింది.

బిగ్ టాస్క్ గానే :

అయితే కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు కనుక ఈ సీటుని ఎనుకుని బరిలోకి దిగితే తొలిసారి క్రిష్ణ దాస్ వారసుడు ఈ వైపు నుంచి పోటీ చేయడం బిగ్ టాస్క్ అని అంటున్నారు. అయితే మరో అయిదేళ్ళకు కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని దాంతో పాటు తమకు పట్టున్న సీటు కాబట్టి ఎవరు ఆపోజిట్ లో ఉన్నా కూడా గెలిచి తీరుతామని దాసన్న వర్గం అంటోంది. అయితే అవతల వైపు ఉన్నది ఓటమెరుగని నాయకుడు, పైగా ఎర్రన్నాయుడు వారసుడు అయితే మాత్రం గట్టిగానే పోటీ ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఆసక్తిని పెంచే అతి పెద్ద నియోజకవర్గంగా నరసన్నపేట ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి.