గొడ్డలిపార్టీకి చుక్కలు చూపిద్దాం: మంత్రులకు లోకేష్ దిశానిర్దేశం
తాజాగా బుధవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు వచ్చారు.
By: Garuda Media | 24 Sept 2026 9:40 AM ISTరాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలు నానాటికీ పెరుగుతున్నాయని మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చట్ట పరంగానే చుక్కలు చూపిద్దామని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదు సంవత్సరాల పాటు టీడీపీని వేధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోందని.. పైగా ఎదురు దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టాలని ఆయన సూచించారు.
తాజాగా బుధవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు వచ్చారు. అయితే.. వీరితో మంత్రి నారా లోకేష్.. తేనీరు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రుల జిల్లాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వైసీపీఅరాచకాలు పెరుగుతున్నాయని.. ఎవరూ ఉపేక్షించవద్దని చెప్పారు. ముఖ్యం గా ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్చుకోలేకపోతున్న వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న మంత్రి లోకేష్.. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఏకగ్రీవాలకు ఎక్కువగా చాన్స్ ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారని.. దీనిని మంత్రులు, నాయకులు అందిపుచ్చుకుని స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేలా చూడాలన్నారు. కూటమి పార్టీల మధ్య పొత్తుల అంశం సమన్వయ కమిటీ, అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడాలన్న 'గొడ్డలి పార్టీ' కుయుక్తులు పనిచేయవని చెప్పారు.
మంత్రి.. అహ్మదాబాద్‌కు..
మంత్రి నారా లోకేష్ గురువారం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రోడ్‌షో.. చేయను న్నారు. గురువారం రాత్రి అహ్మదాబాద్ చేరుకోనున్న మంత్రి నారా లోకేష్... శుక్రవారం అహ్మదాబాద్‌లో సీఐఐ సదస్సు 2026లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. కాగా.. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఇప్పటి వరకు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని సీఎం చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే.
