Begin typing your search above and press return to search.

యువ టీడీపీ...భారీ మార్పులకు సంకేతం!

తెలుగుదేశం పార్టీకి యువ నేత నారా లోకేష్ కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యువతకు ప్రోత్సాహాం ఇస్తామని చెబుతున్నారు.

By:  Satya P   |   28 Jan 2026 8:45 AM IST
యువ టీడీపీ...భారీ మార్పులకు సంకేతం!
X

తెలుగుదేశం పార్టీకి యువ నేత నారా లోకేష్ కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యువతకు ప్రోత్సాహాం ఇస్తామని చెబుతున్నారు. అంతే కాదు పార్టీలో మహిళలకు పెద్ద పీట వేస్తామని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. టీడీపీలో యువ ముద్ర అన్నది గట్టిగా ఉండాలని యూత్ బ్రాండ్ తో దూసుకుని పోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

స్పష్టం చేసినట్లేనా :

టీడీపీ వయసు ఈ రోజుకు అక్షరాలా 43 ఏళ్ళు. ఒక విధంగా చూస్తే నడి వయసులో ఉన్న పార్టీ. ఆ పార్టీలో మొదట్లో చేరిన వారి వయసు నాయకుల సగటు ఏజ్ చూస్తే ఆరు పదుల పై దాటుతోంది. అందుకే లోకేష్ యువ నామస్మరణ అందుకున్నారని అంటున్నారు. పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధుల వర్క్ షాప్ లో లోకేష్ చేసిన కామెంట్స్ అయితే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి.

యువతకే పెద్ద పీట :

టీడీపీలో యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. అదే విధంగా సామాజిక న్యాయం పాటిస్తామని మహిళలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. దాంతో పార్టీలో యంగ్ బ్లడ్ అన్నది ఇపుడు తారక మంత్రం గా మారుతోంది.

నిబంధన అదే :

పార్టీలో ఒకరే దశాబ్దాల పాటు ఒకే పదవిలో ఉండరాదు అని లోకేష్ కుండబద్దలు కొడుతున్నారు తనతో సహా ఎవరైనా ఏ పదవిని అయినా రెండు సార్లు తప్పించి మూడవ సారి కొనసాగరాదు అని ఆయన ఒక కఠిన నిబంధనను అమలు చేయాలని అంటునారు. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకీ అతి పెద్ద రాజకీయ వేదిక చర్చా వేదిక అయిన నిర్ణయాత్మక కేంద్రమైన పొలిట్ బ్యూరోలో సాధారణమైన స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వారికీ ఏదో నాటికి చోటు దక్కుతుదని లోకేష్ అంటున్నారు. తన వరకూ అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలని లోకేష్ బలంగా కోరుకుంటున్నారు.

పార్టీలో అంతర్గత సంస్కరణలు :

తాను క్యాడర్ వైపే ఉంటాను అని పనిమంతులకు యువతకు పార్టీలో స్థానం దక్కేలా చూస్తామని లోకేష్ చేబుతున్నారు. ఒక సగటు పార్టీ కార్యకర్త పొలిట్ బ్యూరో మెంబర్ ఎందుకు కాకూడని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా పార్టీలో అంతర్గత సంస్కరణలు రావాలని ఆయన అంటున్నారు దాని కోసం తాను పొలిట్‌బ్యూరోలో పోరాడాను అని లోకేష్ చెప్పడం విశేషం.

వారికే పెద్ద పీట :

లోకేష్ చెప్పిన దాని బట్టి చూసినా ఇటీవల జిల్లాలలో పార్టీ కమిటీలను చూసినా దాని కంటే ముందు 2024 ఎన్నికల్లో ఎక్కువగా యువతకు టికెట్లు దక్కడం అందులో నుంచి ఎక్కువ మందికి మంత్రులుగా అవకాశాలు రావడం బట్టి చూస్తే యూత్ ఫీల్ తో పార్టీని ముందుకు తీసుకుని పోవాలని నారా లోకేష్ గట్టి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీలో సీనియర్ నేతలు అంతా దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. రేపటి రోజున యువతకు అవకాశాలు అంటే వారు పక్కకు జరగాల్సి ఉంటుంది అన్నది సుస్పష్టంగా అర్ధమవుతోంది.