Begin typing your search above and press return to search.

ఆయనతో పెట్టుకోవద్దు జగన్...లోకేష్ హాట్ వార్నింగ్

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

By:  Satya P   |   2 May 2026 11:35 PM IST
ఆయనతో పెట్టుకోవద్దు జగన్...లోకేష్ హాట్ వార్నింగ్
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా జగన్ కి చెందిన ఒక చానల్ తిరుమలలో భక్తులను ఇంటర్వ్యూ చేస్తూ అక్కడ ఏర్పాట్లు బాగాలేవని చెప్పడానికి ప్రయత్నిస్తోంది అని లోకేష్ ఒక వీడియో బైట్ జత చేసి మరీ ట్వీట్ చేస్తూ జగన్ మీద ఫైర్ అయ్యారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. తిరుమలలో భక్తులు అంతా బాగుందని చెబుతూంటే జగన్ చానల్ మాత్రం అక్కడ ఏమీ సదుపాయాలు లేవు అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేసి భంగపడుతోందని లోకేష్ విమర్శించారు.

వెంకన్నతో పెట్టుకోకు :

ఇక కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు జగన్ అని లోకేష్ హెచ్చరించారు. తిరుమలలో క్యూ లైన్లలో ఉన్న భక్తులతో అబద్ధాలు చెప్పించేందుకు కూడా జగన్ చానల్ ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. ఏర్పాట్లు అన్నీ బాగున్నా కూడా వారి నుంచి ఏదో రాబట్టాలని విఫల ప్రయత్నం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అందరి కంటికీ కనిపిస్తున్నా ఆ చానల్ తన ప్రయత్నం ఆపడం లేదని అన్నారు.

మరోసారి అలా :

నిజం చెప్పాలీ అంటే వైసీపీ అధినేత విషయంలో ఈ తరహా విమర్శలు టీడీపీ చేయడం ఇది మరో సారి అని అంటున్నారు. గతంలో తిరుమల లడ్డూ విషయంలో దానితో పాటు పరకామణి విషయంలో కూడా ఈ విధంగా టీడీపీ వర్సెస్ వైసీపీగా పెద్ద ఎత్తున రాజకీయ రాద్ధాంతం జరిగింది. తిరుమల లడ్డూ విషయం అయితే జగన్ తాను అన్ని మతాలను గౌరవిస్తామని ఆనాడు చెప్పారు. పైగా లడ్డూలో కల్తీ జరగలేదని వైసీపీ నేతలు వాదించారు కూడా. ఆ ఎపిసోడ్ ఇపుడు చల్లబడింది. దీంతో లోకేష్ జగన్ కి హాట్ వార్నింగ్ ఇస్తూ తాజాగా చేసిన ఈ ట్వీట్ అయితే మళ్లీ రాజకీయ మంట పుట్టిస్తుందా అన్న చర్చ సాగుతోంది.

వైసీపీ నేతల నుంచే :

లోకేష్ ఏ రకమైన విమర్శలు చేసినా జగన్ కంటే ఎక్కువగా వైసీపీ నేతలే స్పందిస్తారు. ఇపుడు ఈ విషయంలో కూడా వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే తిరుమల వెంకన్నతో పెట్టుకోవద్దు అంటూ లోకేష్ చేసిన ఈ హెచ్చరిక కూడా స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు. వైసీపీ సైలెంట్ గా ఉంటే వారికే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ వైపు నుంచి కూడా కౌంటర్ ధీటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా చూస్తే లోకేష్ వేసిన ఈ ట్వీట్ ఏపీలో ఏ రకమైన రాజకీయ వేడిని రాజేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.