Begin typing your search above and press return to search.

అన్నా నీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌ కు లోకేష్ ప‌రామ‌ర్శ‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టీడీపీ జాతీయ కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు, మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు.

By:  Garuda Media   |   20 July 2026 12:56 AM IST
అన్నా నీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌ కు లోకేష్ ప‌రామ‌ర్శ‌
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టీడీపీ జాతీయ కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు, మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైద‌రాబాద్‌లోని ప‌వ‌న్ క‌ల్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం చేరుకున్న ఆయ‌న దాదాపు గంటన్న‌ర పాటు అక్క‌డే ఉండి ప‌వ‌న్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవ‌ల ముంబైలోని కోకిలా బెన్ వైద్య‌శాల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడి భుజానికి ఆప‌రేష‌న్ జ‌రిగిన విష యం తెలిసిందే. అనంత‌రం.. ఆయ‌న నాలుగురోజుల కింద‌ట హైద‌రాబాద్‌లోని నివాసానికి చేరుకుని రెస్టు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌రామ‌ర్శించేందుకు నాయ‌కులు క్యూక‌ట్టారు.

ఈ క్ర‌మంలో తాజాగా లోకేష్ కూడా ప‌వ‌న్ ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్నా నీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌!అని ప‌వ‌న్‌కు సూచించారు. అంతే కాదు.. ఇంటి ప‌ట్టునే ఉన్నా.. త‌న పంచాయ‌తీరాజ్ శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారా ల‌ను ప‌రిశీలిస్తున్న విష‌యాన్ని తెలుసుకున్న లోకేష్‌.. ప్ర‌స్తుతం పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాల‌ని సూచించారు. పాల‌నా ప‌ర‌మైన ప‌నుల‌ను త‌ర్వాత చూసుకోవ‌చ్చ‌ని.. సీఎం చంద్ర‌బాబు అన్నీ చూసుకుంటున్నార‌ని చెప్పార‌ని తెలిసింది. పాల‌నా ప‌ర‌మైన అంశాల‌పై కాకుండా.. ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాల‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లోనే ఏపీలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి ధ‌ర్మానికి ప్రాధాన్యం ఉంటుంద‌ని.. మూడు పార్టీలు ఉమ్మ‌డిగానే పోటీ చేస్తాయ‌ని.. ఇరువురు నాయ‌కులు అభిప్రాయానికి వ‌చ్చారు. అదే స‌మయంలో జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రినాదెండ్ల మ‌నోహ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ఇరువురు నాయ‌కులు చ‌ర్చించారు. ఆ వ్యాఖ్య‌లు సీరియ‌స్‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేడ‌ర్ నుంచి ఒత్తిడి ఉన్న నేప‌థ్యంలోనే నాదెండ్ల అలా వ్యాఖ్యానించి ఉంటార‌ని.. కూట‌మిగానే స్థానిక సంస్థ‌ల్లోనూ సత్తా చాటుదామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం స్ప‌ష్టం చేశార‌ని తెలిసింది.

ఇక, సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు ఆమోదం పొందే అవ‌కాశం ఉంద‌ని ఇరువురు నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం తీసుకువ‌చ్చే బిల్లుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతోపా టు.. కేంద్రంలో బీజేపీకి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అబిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా గంట‌కుపైగా జ‌రిగిన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోగ్యంతోపాటు.. ప‌లు స్థానిక అంశాలు, రాజకీయ అంశాల‌పైనా ఇరువురు చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.