Begin typing your search above and press return to search.

నారా లోకేష్ 'రాఖీ' చూశారా... పిక్ వైరల్!

అవును... రాఖీ పండుగ సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరిలోని స్థానిక మహిళలు, విద్యార్థినులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు.

By:  Raja Ch   |   10 Aug 2025 11:51 AM IST
నారా లోకేష్ రాఖీ చూశారా... పిక్  వైరల్!
X

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమా దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆడపిల్లలకు జరిగే అన్యాయంపై ఆయన విరుచుకుపడతారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఆడపిల్లలు ఆయనకు రాఖీలు కడతారు. ఆ సమయంలో మణికట్టు మొత్తం రాఖీలతో నిండిపోతుంది. సరిగ్గా అదే టైపులో, అంతకు మించిన రాఖీలతో అన్నట్లుగా ఉన్న నారా లోకేష్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అవును... రాఖీ పండుగ సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరిలోని స్థానిక మహిళలు, విద్యార్థినులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో మణికట్టు నుంచి, మోచేతి వరకూ రాఖీలతో నింపేశారు. ఈ సమయంలో నారా లోకేష్ చేయి ఫోటో చూసినవారు.. "రాఖీ" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది!

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... తనకు సొంత అక్కాచెల్లెళ్లు లేరని.. మంగళగిరి మహిళలే తనకు ఆడపడుచులని.. వారి ఆదరణకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని నారా లోకేష్ అన్నారు. ఇదే సమయంలో... నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నానని నారా లోకేష్ స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వ భూముల్లో నివసించే సుమారు మూడు వేల మందికి.. రూ.1,000 కోట్ల విలువైన శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. వాటిలో ప్రధానమైన భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్‌ పైప్‌ లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.