లోకేష్.. కేడర్ అస్త్రం.. ఫ్యూచర్ ఫస్ట్.. !
ఈ క్రమంలో ప్రధానంగా మూడు అంశాలపై లోకేష్ భారీ ఆశలు పెట్టుకున్నారు. 1) నేరుగా కేడర్‌తో తానే మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే.. అది పార్టీకి మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
By: Garuda Media | 28 July 2026 10:00 PM ISTటీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్.. కేడర్ అస్త్రాన్ని ఎంచుకున్నారు. నిన్న మొ న్నటి వరకు రాజకీయం ఎలా ఉన్నా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వా లని డిసైడ్ అయ్యారు. ఏ కార్యక్రమం కోసం బయటకు వచ్చినా.. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు కేడర్‌కు చివరిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. కుదిరితే కేడర్‌తో మమేకం అవుతున్నారు. లేకపోతే వెళ్లిపో తున్నారు. జిల్లాల పర్యటనలో దీనిని స్పష్టంగా గమనించవచ్చు.
అయితే.. ఇప్పుడు ఈ బాధ్యతలను పూర్తిగా నారా లోకేష్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాల పర్యటనల సమయంలో అధికారిక కార్యక్రమాల కంటే ముందుగానే కేడర్‌తో మమేకం అయ్యేందుకు లోకేష్ ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. సమస్యలు తెలుసుకుంటానని.. వాటిని పరిష్కరించే ప్రయ త్నం చేస్తానని కూడా ఆయన చెప్పారు. తద్వారా కేడర్‌కు నేరుగా తనకు మధ్య బంధం పెంచుకునేందు కు లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధానంగా మూడు అంశాలపై లోకేష్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
1) నేరుగా కేడర్‌తో తానే మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే.. అది పార్టీకి మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి నాయకులకు అప్పగించారు. ఇది గ్యాప్‌ను మరింత పెంచుతోందని అంచనా వేశారు. దీనిని పరిష్కరించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాలన్నది లోకేష్ ఆలోచనగా ఉంది.
2) వచ్చే ఎన్నికలు: వచ్చే ఎన్నికల్లో కేడర్‌ను పూర్తిస్థాయిలో తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నాయకులకంటే కూడా.. కేడర్‌పై పట్టు పెంచుకోవడంతో తాను ఎలివేట్ కావడంతోపాటు.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
3) పార్టీ: పార్టీ పరంగా మరికొన్నాళ్లకయినా.. లోకేష్ పగ్గాలు చేపట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో నాయకులు మారినా.. కేడర్ పట్టు తప్పకుండా ఉండేందుకు కూడా తానే జోక్యం చేసుకుంటే బెటర్ అనేది లోకేష్ ఆలోచనగా ఉంది.
ఈ మూడు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్న లోకేష్.. కేడర్‌కు విస్తృతమైన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.
