జగన్‌కు షాక్: మా-వి-గన్..కు లోకేష్ కొత్త ఎబ్రివేషన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్ర రాజధానికి సంబంధించి చేసిన ప్లాన్-బీ ప్రతిపాదన వికటించిందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 9 April 2026 9:12 AM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్ర రాజధానికి సంబంధించి చేసిన ప్లాన్-బీ ప్రతిపాదన వికటించిందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాష్ట్ర రాజధానిగా.. ప్రపంచంలోనే అతి పెద్ద రాజధానిగా అమరావతి అవతరించిన నేపథ్యానికి తోడు పార్లమంటు ఉభయ సభలు కూడా దీనిని ఆమోదించాయి. రాష్ట్రపతి సైతం చేవ్రాలు చేసేసి.. చక్కగా గెజిట్ కూడాఇచ్చేశారు. అయినా.. జగన్ మాత్రం తన ప్లాన్-బీ.. `మావిగన్`ను మాత్రం వదిలి పెట్టలేదు. బుధవారం కూడా.. మా-వి-గన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులతో కూడిన రాజధాని)కే మొగ్గు చూపారు.
అయితే..ఈ ప్రతిపాదనను ఆది నుంచి తీవ్రంగా తిప్పికొడుతున్న అధికార కూటమి పార్టీలు.. జగన్ వైఖరిపై విమర్శలు గుప్పి స్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మంత్రి నారా లోకేష్.. మా-వి-గన్‌కు కొత్త ఎబ్రివేషన్ చెప్పారు. అసలు.. జగన్ కానీ, వైసీపీ నాయకులు కానీ.. ఊహించని రీతిలో ఆయన ఇచ్చిన ఎబ్రివేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇదీ లోకేష్ మా-వి-గన్!
మా- మాయ
వి- విధ్వంసం
గన్-గన్‌దరగోళం లేదా గన్.. కల్చర్.
వైసీపీ చేసేది ఇదేనని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఇలానే చేసిందని లోకేష్ చెప్పారు. అంతేకాదు.. ``మావిగన్ మావయ్య`` అని జగన్‌ను ఎద్దేవాచేశారు. ఈ మేరకు మంత్రి లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జగన్ చెప్పే మా-వి-గన్‌లో మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, గన్ అంటే గన్‌దరగోళం లేదా గన్ కల్చర్ అని పేర్కొన్నారు. దానికి #MavigunMavayya, #HistoricAmaravatiResolution హ్యాష్‌ట్యాగ్‌లను ట్యాగ్ చేశారు.
